Home /News /national /

CHENNAI RAIN LIVE HEAVY RAIN LASHES CITY TWO RESERVOIRS TO BE OPENED TODAY FLOOD ALERT SOUNDED SK

Chennai Rains: జల దిగ్బంధంలో చెన్నై నగరం.. వర్ష బీభత్సాన్ని కళ్లకు గట్టే దృశ్యాలు..

చెన్నైలో వర్షాలు

చెన్నైలో వర్షాలు

Chennai Rains: తమిళనాడును ఆనుకొని ఉన్న నెల్లూరులోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. శనివారం రాత్రి నుంచి వానలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి.

    బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Low Pressure in Bay of bengal) ప్రభావంతో చెన్నైలో కుండపోత వర్షాలు (Chennai Heavy Rains) భారీగా కురుస్తున్నాయి. రాత్రి నుంచి కురిసిన ఎడతెరిపి లేని వానకు చెన్నై మహానగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. చెన్నైలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. మ్యాన్ హోల్స్ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోవడంతో చెన్నై వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రైవేట్ వాతావరణ సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం.. 2015 తర్వాత చెన్నైలో కురిసిన భారీ వర్షం ఇదే. ఇవాళ ఉదయం 8 గంటల సమయం వరకు.. నుంగంబాక్కంలో అత్యధికంగా 20.8 సెం.మీ., మీనంబాక్కంలో 9.4 సెం.మీ., ఎన్నోర్‌లో 8 సెం.మీ. వర్షపాతం కురిసింది.

    షాకింగ్: Puneeth Rajkumar మృతిపై అనుమానాలు -డాక్టర్‌పై దాడికి ఫ్యాన్స్ -పోలీసుల ఎంట్రీతో..

    చెన్నైతో పాటు చెంగల్‌పట్టు, తిరువల్లూరు, కాంచీపురం, తిరుచిరాపల్లి, పుదుకొట్టై, తంజావూరు, తిరువారూర్, నాగపట్టినమ్, మయిలాడుతురై, శివగంగ, కన్యాకుమారి, తిరునెల్వేలి, తెన్‌కాశి, తూత్తుకుడి, రామనాథ పురంలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఇవాళ సాయంత్రం వరకు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి.

    చెన్నైలో వర్ష బీభత్స దృశ్యాలను ఇక్కడ చూడండి











    Free Ration: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఉచిత రేషన్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం

    భారీ వర్షాల ధాటికి వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. జలాశయలు నిండు కుండల్లా మారాయి. చెన్నై శివారులోని పూండి, పుళల్, చెంబరంబాక్కం రిజర్వాయర్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. తమిళనాడును ఆనుకొని ఉన్న నెల్లూరులోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. శనివారం రాత్రి నుంచి వానలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Chennai rains, Heavy Rains, Tamilnadu, Tamilnadu rains

    తదుపరి వార్తలు