Anti-CAA Protest : అట్టుడుకుతున్న చెన్నై... సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులపై లాఠీఛార్జ్...

Anti-CAA Protest : పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా, అనుకూలంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. వాటిలో భాగంగా చెన్నైలో ఆందోళనలు చేస్తున్నవారిపై పోలీసులు లాఠీఛార్జ్ ఎందుకు చేశారు?

news18-telugu
Updated: February 15, 2020, 10:42 AM IST
Anti-CAA Protest : అట్టుడుకుతున్న చెన్నై... సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులపై లాఠీఛార్జ్...
Anti-CAA Protest : అట్టుడుకుతున్న చెన్నై... సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులపై లాఠీఛార్జ్...
  • Share this:
Anti-CAA Protest in Chennai : పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా... చెన్నైలోని అలందూర్, మౌంట్ రోడ్, తంబారంలో పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు ప్రజలు. ఐతే... వాళ్లను నిలువరించే క్రమంలో ఇద్దరు మహిళా పోలీసులకు గాయాలు అవ్వడంతో... ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఛార్జ్‌లో చాలా మంది గాయాలపాలయ్యారు. పోలీసుల చర్యతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. తమిళనాడులోని చాలా నగరాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు సాగాయి. వాటిలో ఎక్కువగా ముస్లింలు పాల్గొన్నారు. ముఖ్యంగా అలందూర్, మౌంట్ రోడ్, తంబారంలో పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు పాల్గొన్నారు. మధురై, కోయంబత్తూర్, తిరుచ్చి జిల్లాలు ఆందోళనలతో హోరెత్తాయి. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు నిరసన గళం వినిపించారు స్థానికులు.

Anti-CAA Protest : అట్టుడుకుతున్న చెన్నై... సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులపై లాఠీఛార్జ్...
పోలీసుల లాఠీఛార్జ్‌లో గాయపడిన ఆందోళనకారుడు


ఆందోళనలు జరిపిస్తున్న వారితో చెన్నై పోలీస్ కమిషనర్ ఏకే విశ్వనాథ్ మీటింగ్ పెట్టారు. ఫిర్యాదులు స్వీకరించారు. ఐతే... ఉత్తర చెన్నైలోని వషేర్‌మాన్‌పేట్‌లో కొంత మంది ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. అక్కడ అనుమతి లేకుండా ఆందోళనలు చేశారని పోలీసులు అంటున్నారు.




అరెస్టు చేసిన వారిని రిలీజ్ చేసి... శాంతియుతంగా నిరసనలు తెలుపుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆందోళనకారులు కోరుతున్నారు. కానీ పోలీసులు మాత్రం... తమపై ఆందోళనకారులు రాళ్లు విసురుతున్నారనీ... మరింత మంది అదనపు బలగాలు తమకు అవసరం అని అంటున్నారు. ఇలా అటు పోలీసులు, ఇటు ఆందోళనకారుల తీరుతో... ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే చెన్నై... ఇప్పుడు ఉద్రిక్తలతో ఉంది.
First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు