ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఎవరూ షేక్ హ్యాండ్స్ ఇవ్వడం లేదు. బహిరంగ ప్రదేశాల్లో చేతులు పెట్టాలంటే కూడా భయపడుతున్నారు. అలాంటిది, లిఫ్ట్‌లు ఆపరేట్ చేయాలంటే అదో టెన్షన్. ఎవరైనా కరోనా వైరస్ ఉన్న వ్యక్తి ఆ లిఫ్ట్ బటన్లు నొక్కారేమో.. అని అందరికీ అనుమానం వస్తూ ఉంటుంది. మన చేత్తో ఆ బటన్లు నొక్కితే మళ్లీ ఆ చేతులు ముక్కు, మొహం అంతా అనుకోకుండానే రాసుకుంటూ ఉంటారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా చెన్నై మెట్రో రైలు ఓ కొత్త ఐడియాతో ముందుకొచ్చింది. చెన్నైలోని ఓ మెట్రో స్టేషన్లో కాలితో లిఫ్ట్ బటన్లను ఆపరేట్ చేసే సౌకర్యాన్ని తీసుకొచ్చింది. అంటే లిఫ్ట్ బటన్లను కాలికి అందుబాటులోకి తెచ్చింది. అందులో ఎవరు ఏ ఫ్లోర్ కావాలంటే ఆ ఫ్లోర్ నెంబర్‌ను కాలితోనే నొక్కవచ్చు. కోయంబేడులోని చెన్నై మెట్రో హెడ్ ఆఫీసులో ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. దీన్ని మిగిలిన మెట్రో స్టేషన్లలో కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ వల్ల మెట్రో సర్వీసులు ప్రస్తుతం నడవడం లేదు. ఒకవేళ లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా మెట్రోకు అవకాశం కల్పించిన తర్వాత కూడా ప్రజలు సామాజికదూరం పాటించేలా మెట్రో స్టేషన్లలో మార్కింగ్ చేస్తోంది. మెట్రో స్టేషన్లతో పాటు రైళ్లలో కూడా హెచ్చరిక బోర్డులు, ఫ్లోర్ మీద కొన్ని సూచనలు కూడా పెయింట్ చేయిస్తోంది. లాక్ డౌన్ సమయంలో కేవలం 25 శాతం మంది స్టాఫ్‌తో పనులు చేయిస్తోంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.