Vande Bharat Express: దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్( Vande Bharat Express)రైలు త్వరలో పరుగులు తీయనుంది. అధిక వేగం, అత్యాధునిక సౌకర్యాలతో ఈ రైలు అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 11న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. బెంగళూరు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ(PM Modi) రైలు సేవలను లాంచ్ చేయనున్నారు. ఇది దేశంలోని ఐదో వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఈ ట్రైన్ బెంగళూరు(Banalore) మీదుగా చెన్నై(Chennai), మైసూరు(Mysore) మధ్య సేవలు అందిస్తుంది. నవంబర్ 5న ఈ సెమీ-హై-స్పీడ్ రైలు ట్రయల్స్ కోసం ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి బయలుదేరుతుంది. ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం సేవలు అందించనుంది.
రైలులో సౌకర్యాలు
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రపంచ స్థాయి ప్రయాణీకుల సౌకర్యాలతో కూడిన భారతదేశపు మొదటి సెమీ హైస్పీడ్ రైలు. ఇది వేగవంతమైన యాక్సెలరేషన్, డీసెలరేషన్ అధిక వేగాన్ని అందుకోగలదు. ప్రయాణ సమయాలను 25 శాతం నుంచి 45 శాతం వరకు తగ్గిస్తుంది. ఈ రైలు 52 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. అన్ని వందే భారత్ కోచ్‌లకు ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి. GPS బేస్డ్ ఆడియో-విజువల్ ప్యాసెంజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఎంటర్ట్రైన్మెంట్ కోసం ఆన్-బోర్డ్ హాట్‌స్పాట్ Wi-Fi, సౌకర్యవంతమైన సీటింగ్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో రొటేటింగ్ ఛైర్లు ఉంటాయి.
బెంగళూరు సిటీ జంక్షన్లో 1 హాల్ట్
20607 MGR చెన్నై సెంట్రల్ - మైసూరు జంక్షన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు బెంగళూరు సిటీ జంక్షన్లో 1 హాల్ట్ మాత్రమే ఉంటుంది. ఇది ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి ఉదయం 5:50 గంటలకు బయలుదేరి 10:25 గంటలకు బెంగళూరు సిటీ జంక్షన్‌కు చేరుకుంటుంది. బెంగళూరు నుంచి ఉదయం 10:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు లాస్ట్ స్టాప్ మైసూరు చేరుకుంటుంది.
ఈ రైలు 6 గంటల 40 నిమిషాల్లో దాదాపు 497 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంటుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆదివారం, సోమ, మంగళ, గురు, శుక్ర, శనివారాల్లో వారానికి ఆరు రోజులు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో మైసూరు జంక్షన్ నుంచి మధ్యాహ్నం 1:05 గంటలకు బయలుదేరి 2:55 గంటలకు బెంగళూరు సిటీ జంక్షన్‌కు చేరుకుంటుంది. ఈ రైలు బెంగళూరు సిటీ జంక్షన్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 7:35 గంటలకు MGR చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. ఈ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. indiarailinfo.com ప్రకారం.. రైలు అందుబాటులోకి వచ్చిన తర్వాత టైమ్‌టేబుల్‌లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
దివ్యాంగులకు ప్రత్యేకంగా
రైలులోని టాయిలెట్లు బయో-వాక్యూమ్ రకానికి చెందినవి. దివ్యాంగుల కోసం అనుకూలమైన వాష్‌రూమ్‌లు ఉన్నాయి. అదే విధంగా అంధులు సులువుగా తెలుసుకొనేలా సీట్ నంబర్లు బ్రెయిలీ అక్షరాలతో ఉంటాయి. ప్రతి కోచ్‌లో వేడి భోజనం, వేడి, శీతల పానీయాలు అందించడానికి అన్ని సౌకర్యాలతో కూడిన ప్యాంట్రీ ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangalore, Chennai, Mysore, Vande Bharat Train