• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • CHEERS CLAPS FOR PILOT ABHINANDAN VARTHAMANS PARENTS ON FLIGHT TO DELHI MS

ఉద్విగ్నం : విమానంలో అభినందన్ తల్లిదండ్రులకు అభినందనల వెల్లువ..

ఉద్విగ్నం : విమానంలో అభినందన్ తల్లిదండ్రులకు అభినందనల వెల్లువ..

అభినందన్‌ వర్థమాన్

Cheers, Claps For Pilot Abhinandan Varthaman's Parents : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం అక్కడి పార్లమెంటులో అభినందన్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో అభినందన్ అప్పగింతపై ప్రతిష్టంభన తొలగిపోయింది. శుక్రవారం మధ్యాహ్నాం 12గంటల ప్రాంతంలో వాఘా సరిహద్దు వద్ద పాక్ అభినందన్‌ను భారత్‌కు అప్పగించనుంది.

  • Share this:
    పాక్ అదుపులో ఉన్న భారత వైమానిక దళ పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ రాకవేళ భారత్-పాక్ సరిహద్దు వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఆయన రాకకు ఘనస్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకుంటున్నారు. అదే సమయంలో అభినందన్ తల్లిదండ్రులు రిటైర్డ్ ఎయిర్‌ మార్షల్‌ ఎస్‌.వర్ధమాన్‌, శోభా వర్ధమాన్‌, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆయన్ను కలిసేందుకు చెన్నై నుంచి బయలుదేరారు. శత్రు దేశానికి చిక్కినా.. మొక్కవోని ధైర్య సాహసాలను ప్రదర్శించిన కన్నబిడ్డను మనసారా ఆళింగనం చేసుకునేందుకు వారు అక్కడికి బయలుదేరారు.

    గురువారం రాత్రి చెన్నై నుంచి ఢిల్లీ బయలుదేరిన అభినందన్ కుటుంబ సభ్యులను విమానంలో తోటి ప్రయాణికులు ఆశ్చర్యపరిచారు. కరతాళ ధ్వనులతో అభినందన్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు దేశం తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు. అలాంటి బిడ్డను కన్న మిమ్మల్ని చూసి గర్వపడుతున్నామని అభినందన్ తల్లిదండ్రులతో ప్రయాణికులు చెప్పారు. వారి అభిమానానికి అభినందన్ తల్లిదండ్రులు ముగ్ధులయ్యారు.


    భారత్‌పై పాక్ వైమానిక దాడిని తిప్పికొట్టే క్రమంలో భారత్‌కు చెందిన మిగ్-21 అదృశ్యమై.. వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్‌కు చిక్కిన సంగతి తెలిసిందే. అభినందన్ పాకిస్తాన్‌కు చిక్కడంతో ఆయన పరిస్థితిపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం అక్కడి పార్లమెంటులో అభినందన్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో అభినందన్ అప్పగింతపై ప్రతిష్టంభన తొలగిపోయింది. శుక్రవారం మధ్యాహ్నాం 12గంటల ప్రాంతంలో వాఘా సరిహద్దు వద్ద పాక్ అభినందన్‌ను భారత్‌కు అప్పగించనుంది.

    First published: