Home /News /national /

CHECK THE TRAFFIC JAM AT THE TOLL PLAZAS NO MORE PAYMENTS WITH THIS NEW TECHNOLOGY UMG GH

Toll Plazas: టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్‌కు చెక్.. ఇకపై ఈ కొత్త టెక్నాలజీతో చెల్లింపులు !

 టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ కు చెక్.. ఇకపై ఈ కొత్త టెక్నాలజీతో చెల్లింపులు !

టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ కు చెక్.. ఇకపై ఈ కొత్త టెక్నాలజీతో చెల్లింపులు !

దేశంలోని టోల్ ప్లాజా(Toll Plaza)లను కొత్త టెక్నాలజీలతో రీప్లేస్‌ చేసే యోచనలో ప్రభుత్వం ఉందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ(Nitin Gadkari) చెప్పారు. కొత్త సిస్టమ్‌ను ఆరు నెలల్లోపు అమలు చేస్తామని తెలిపారు.

దేశంలోని టోల్ ప్లాజా(Toll plaza)లను కొత్త టెక్నాలజీలతో రీప్లేస్‌ చేసే యోచనలో ప్రభుత్వం ఉందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ(Nitin Gadkari) చెప్పారు. కొత్త సిస్టమ్‌ను ఆరు నెలల్లోపు అమలు చేస్తామని తెలిపారు. బుధవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సప్లిమెంటరీలకు మంత్రి సమాధానమిచ్చారు. టోల్ ప్లాజాల వల్ల ట్రాఫిక్ జామ్‌లు, పొడవాటి క్యూలు వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, వాటిని దూరం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు.

పరిశీలనలో రెండు టెక్నాలజీలు
ఒకే దిశలో 60 కిలోమీటర్లలోపు టోల్‌ప్లాజాలు ఉండటం చట్టపరం కాదని సభ్యులు అడిగిన ప్రశ్నలకు గడ్కరీ తెలిపారు. ‘ప్రభుత్వం ఇప్పుడు రెండు ఆప్షన్‌లను పరిశీలిస్తోంది. అందులో ఒకటి శాటిలైట్(Satellite) బేస్డ్‌ టోల్ సిస్టమ్. ఈ విధానంలో GPS కారులో ఉంటుంది, టోల్ నేరుగా ప్రయాణీకుల బ్యాంక్ అకౌంట్ నుంచి డిడక్ట్‌ అవుతుంది. మరొకటి కారు నంబర్‌ ప్లేట్‌ ద్వారా టోల్‌ ఛార్జీ డిడక్ట్‌ అవుతుంది. శాటిలైట్‌ ఉపయోగిస్తున్నప్పుడు ఫాస్ట్‌ట్యాగ్‌(Fast Tag)కు బదులుగా GPSని ప్రవేశపెట్టే ప్రక్రియలో ఉన్నాం. దాని ఆధారంగా టోల్ వసూలు చేయాలని భావిస్తున్నాం. నంబర్ ప్లేట్‌ ద్వారా వసూలు చేసే టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. భారతదేశంలో టెక్నాలజీ భాగా అభివృద్ధి చెందింది. మేం ఇంకా ఏ టెక్నాలజీ వినియోగించాలనే అంశంలో అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. నా దృష్టిలో నంబర్ ప్లేట్ టెక్నాలజీ వినియోగిస్తే టోల్‌ప్లాజాల అవసరం ఉండదు. అధునాతన కంప్యూటరైజ్డ్ డిజిటల్ సిస్టమ్ టోల్‌ వసూలు చేయవచ్చు. దీని ద్వారా పొడవాటి క్యూలు, వేచి ఉండే సమస్యలు తప్పుతాయి. ప్రజలు ఉపశమనం పొందుతారు.’ అని కేంద్ర మంత్రి చెప్పారు.

టోల్‌ చెల్లించకపోతే జరిమానా
అయితే ఇలాంటి టెక్నాలజీల కోసం పార్లమెంటులో బిల్లు తీసుకురావాలని, ఎవరైనా టోల్ చెల్లించకపోతే వారికి జరిమానా విధించే చట్టం ఇంకా అందుబాటులో లేదని గడ్కరీ వివరించారు. టోల్ వసూలుకు బెస్ట్‌ టెక్నాలజీని ఎంపిక చేసే పనిలో ఉన్నామని చెప్పారు. పార్లమెంట్‌లో ముఖ్యమైన చట్టాన్ని కూడా తీసుకువస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Income Tax Returns: గడువు లోగా ఐటీఆర్ ఫైల్ చేయలేదా ? అయితే ఎన్ని ప్రయోజనాలు కోల్పోతారో తెలుసా !



టోల్‌ వసూలు చేసే కొత్త విధానాన్ని ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారనే ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. ‘ఇది కచ్చితంగా త్వరగా అందుబాటులోకి తీసుకు రావాల్సిన విధానం. ఆరు నెలల్లో పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తాం. దేశ ప్రజలకు ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం కల్పించడం చాలా అవసరం. కొత్త టెక్నాలజీ కూడిన నంబర్ ప్లేట్లు ప్రవేశపెట్టాం. వాటిని వినియోగించడం తప్పనిసరి.’ అని చెప్పారు.



ఫాస్ట్‌ట్యాగ్‌ వసూళ్లు రోజుకు రూ.120 కోట్లు
టోల్ చేసిన హైవేలపై కారు నడిపిన కచ్చితమైన సమయానికి టోల్ చెల్లించాల్సి ఉంటుందని, చెల్లించాల్సిన మొత్తమే ఖాతా నుంచి డిడక్ట్‌ అవుతుందని గడ్కరీ చెప్పారు. టెక్నాలజీని ఇంకా సెలక్ట్‌ చేయలేదని, వీలైనంత త్వరగా, ఒక నెలలో టెక్నాలజీని సెలక్ట్‌ చేస్తామని తెలిపారు. ప్రపంచంలోని అన్ని అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలను ఉపయోగిస్తామని, దీని ద్వారా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని, క్యూలు, ట్రాఫిక్ సమస్యలు ఉండవని స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా టోల్ ప్లాజాల సమస్యను పరిష్కరిస్తామన్నారు. దేశంలో ఫాస్ట్‌ట్యాగ్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, టోల్ ఆదాయం గణనీయంగా పెరిగిందని గడ్కరీ తెలియజేశారు. ఒక్కరోజులోనే రూ.120 కోట్ల టోల్‌ వసూలు అవుతోందని, ఇప్పటి వరకు 5.56 కోట్ల ఫాస్ట్‌ట్యాగ్‌లు జారీ చేశామని వివరించారు.
Published by:Mahesh
First published:

Tags: Gps, Nhai, Nitin Gadkari, Toll plaza

తదుపరి వార్తలు