• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • CHEATING CASE REGISTERED AGAINST PRASHANT KISHOR IN BIHAR NK

చీటింగ్ కేసులో బుక్కైన ప్రశాంత్‌ కిషోర్‌... జేడీయూ నుంచీ తొలగించిన కొన్ని వారాలకే...

చీటింగ్ కేసులో బుక్కైన ప్రశాంత్‌ కిషోర్‌... జేడీయూ నుంచీ తొలగించిన కొన్ని వారాలకే...

ప్రశాంత్ కిషోర్

FIR on Prashant Kishor : బీహార్‌లో కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్న ప్రశాంత్ కిషోర్‌కి ఈ చీటింగ్ కేసు తలనొప్పి లాంటిదే. చిన్న కేసే అయినా... దీన్నుంచీ ఆయన ఎలా బయటపడతారన్నది తేలాల్సిన అంశం.

  • Share this:
    FIR on Prashant Kishor : రాజకీయ వ్యూహకర్త, జేడీయూ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్‌పై సెక్షన్ 420 (చీటింగ్ కేసు) కేసు నమోదైంది. తన ఆలోచనను కాపీ చేసి ప్రశాంత్‌ కిషోర్‌... ‘బాత్‌ బీహార్‌ కీ’ కార్యక్రమాన్ని సెట్ చేశారంటూ బీహార్‌... మోతీహారీకి చెందిన యువకుడు గౌతమ్‌ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అసలు ఈ ‘బాత్‌ బీహార్‌ కీ’ కార్యక్రమం తను ఆలోచించినదనీ... తన మాజీ సహ ఉద్యోగి ఒసామా... ఈ ఐడియాను ప్రశాంత్ కిషోర్‌కి చెప్పాడని గౌతమ్ అంటున్నాడు. తాను ‘బీహార్‌ కీ బాత్‌’ అనే కార్యక్రమాన్ని జనవరిలో మొదలుపెడితే... ప్రశాంత్ కిషోర్... ఫిబ్రవరిలో ప్రారంభించారని తెలిపాడు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాల్ని పోలీసులకు ఇచ్చాడు. వీటిని గమనించిన పోలీసులు... ఆధారాలుగా పరిగణిస్తూ... 420 (చీటింగ్), 406 (నమ్మకద్రోహం) సెక్షన్ల కింద ప్రశాంత్‌ కిషోర్‌, ఒసామాలపై కేసులు రాసి... దర్యాప్తు మొదలుపెట్టారు.

    కోటి మంది యువతీ యువకుల అభిప్రాయాల్ని తెలుసుకోవడమే ఫిబ్రవరి 20న ప్రశాంత్‌ కిషోర్‌ ‘బాత్‌ బీహార్‌ కీ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టేందుకు 100 రోజుల పాటు రాష్ట్రమంతా పర్యటిస్తానని ఆయన అన్నారు. బీహార్‌ను వచ్చే 15 ఏళ్లలో దేశంలోని 10 గొప్ప రాష్ట్రాల్లో ఒకటిగా చేస్తానన్నారు. ఆ సంగతేమోగానీ... ఇప్పుడీ కేసు నుంచీ ఆయన ఎలా బయటపడతారన్నది తేలాల్సిన అంశం. ఈ కేసు అనుకోకుండా నమోదైనా... దీని వెనక జేడీయూ హస్తం ఉండి ఉండొచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే... కొన్ని వారాల కిందటే... ప్రశాంత్ కిషోర్‌ని పార్టీ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ నుంచీ జేడీయూ తొలగించింది.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు