Home /News /national /

CHARTER PLANE FROM INDIA CARRYING 12 PASSENGERS LANDS IN KARACHI REASON UNKNOWN PVN

Indian Plane : అసలేం జరిగింది? అకస్మాత్తుగా పాక్ లో ల్యాండ్ అయిన హైదరాబాద్ విమానం!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

India Charter plane lands in Pakistan : భారతదేశానికి చెందిన ఒక చార్టర్ విమానం(Charter Plane) సోమవారం అకస్మాత్తుగా పాకిస్తాన్‌లోని కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
India Charter plane lands in Pakistan : భారతదేశానికి చెందిన ఒక చార్టర్ విమానం(Charter Plane) సోమవారం అకస్మాత్తుగా పాకిస్తాన్‌లోని కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ఈ విమానంలో 12మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రత్యేక విమానం హైదరాబాద్‌(Hyderabad)లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(RGIA) నుండి బయలుదేరి, మధ్యాహ్నం 12:10 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) కరాచీ(Karachi) విమానాశ్రయంలో దిగిందని సమాచారం. సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) ప్రతినిధి ఈ విషయాన్ని ధృవీకరించారు. అంతర్జాతీయ చార్టర్ విమానం భారతదేశం నుండి ఎగిరిందని,దానికి దేశంతో మరే ఇతర సంబంధం లేదని అన్నారు.

అయితే కరాచీలో దిగిన కొద్దిసేపటికే 12 మంది ప్రయాణికులతో ప్రత్యేక విమానం బయలుదేరింది. అయితే కరాచీ విమానాశ్రయంలో విమానం ఎందుకు ల్యాండ్ అయిందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.దీనికి గల కారణాలపై విమానయాన శాఖ ఆరా తీస్తుంది.

Olive oil : ఆలివ్ ఆయిల్ "ద్రవ బంగారం"..దీని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!



కాగా,సాంకేతిక సమస్యల కారణంగా గత నెలలో భారత్‌కు చెందిన రెండు విమానాలు కరాచీలో ల్యాండ్ అయిన తర్వాత తాజా ఘటన చోటు చేసుకుంది. జులై 5న స్పైస్‌జెట్ కు చెందిన ఢిల్లీ-దుబాయ్ విమానం మిడ్ ఎయిర్ లో సమస్యలు తలెత్తడంతో కరాచీలో అత్యవసర ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇండిగో యొక్క షార్జా-హైదరాబాద్ విమానాన్ని జూలై 17న పైలట్‌లు ఇంజన్‌లో లోపాన్ని గమనించిన తర్వాత ముందుజాగ్రత్తగా కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: AIRCRAFT, India, Pakistan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు