అన్‌లాక్ 1 లోనే దేశవ్యాప్తంగా చాలా దేవాలయాలు తెరచుకున్నాయి. ఇక అన్‌లాక్ 2లో మిగిలిన దేవాలయాల్లోనూ భక్తులను అనుమతిస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను మరింత సడలించిన నేపథ్యంలో... హిందువుల పవిత్ర ఛార్‌దామ్ యాత్ర ప్రారంభమైంది. బుధవారం నుంచి గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తున్నారు. ఐతే కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో బయట రాష్ట్రాల భక్తులను అనుమతించడం లేదు. కేవలం ఉత్తరాఖండ్‌కు చెందిన వారికి మాత్రమే యాత్రకు అనుమతిస్తున్నారు.
Chardham Yatra started from today for residents of Uttarakhand. On the first day, Uttarakhand Devasthanam Management Board issued 422 e-passes for devotees;154 e-passes issued for Badrinath Temple, 165 for Kedarnath Temple, 55 for Gangotri Temple & 48 for Yamunotri Temple. pic.twitter.com/Ku1DPLNMr2
— ANI (@ANI) July 1, 2020
ఈ మేరకు ఉత్తరాఖండ్ దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డు మొదటి రోజు 422 ఈ పాసులను మంజూరు చేసింది. బద్రీనాథ్ ఆలయానికి 154, కేదార్‌నాథ్ ఆలయానికి 165, గంగోత్రి ఆలయానికి 55, యమునోత్రికి 48 ఈ-ఉత్తరాఖండ్ దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డు మొదటి రోజు 422 ఈ పాసులను మంజూరు చేసింది. బద్రీనాథ్ ఆలయానికి 154, కేదార్‌నాథ్ ఆలయానికి 165, గంగోత్రి ఆలయానికి 55, యమునోత్రికి 48 ఈ పాసులను ఇచ్చారు. పాసులను ఇచ్చారు. కరోనా నేపథ్యంలో అన్నిరకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డు వెల్లడించింది. పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులకు అనుమతిస్తున్నట్లు తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kedarnath, Uttarakhand