హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

India-pakistan Border: ఇండియా-పాకిస్థాన్ బార్డర్ లో కలకలం..అప్రమత్తమైన BSF పోలీసులు

India-pakistan Border: ఇండియా-పాకిస్థాన్ బార్డర్ లో కలకలం..అప్రమత్తమైన BSF పోలీసులు

border: ఇండియా-పాకిస్థాన్ బార్డర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే పలుసార్లు పాకిస్థాన్ చొరబాటుకు యత్నించి విఫలమైంది. ఇక తాజాగా మరోసారి అలాంటి ప్రయత్నమే చేసి కుటిల బుద్దిని ప్రదర్శించింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Rajasthan

  ఇండియా-పాకిస్థాన్ బార్డర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే పలుసార్లు పాకిస్థాన్ చొరబాటుకు యత్నించి విఫలమైంది. ఇక తాజాగా మరోసారి అలాంటి ప్రయత్నమే చేసి కుటిల బుద్దిని ప్రదర్శించింది. కానీ ఈసారి టెక్నాలజీని వాడుకుంటూ చొరబాటు ప్రయత్నాలు చేసింది.  దీనికి ధీటుగా భారత సాయుధ బలగాలు సమాధానం ఇచ్చాయి. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనతో బార్డర్ లో కలకలం రేగింది.

  పూర్తి వివరాల్లోకి వెళితే..రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీగంగా నగర్ సరిహద్దు ప్రాంతంలోకి పాక్ డ్రోన్ ను పంపింది. దీనిని గమనించిన BSF జవాన్లు డ్రోన్ లక్ష్యంగా కాల్పులు చేశారు. దీనితో డ్రోన్ లో ఉన్న హెరాయిన్ కింద పడిపోయింది. అలాగే డ్రోన్ కూడా కుప్పకూలింది. అనంతరం డ్రోన్ పడిన ప్రాంతంలో సోదాలు నిర్వహించగా..మరో 4 ప్యాకెట్ల హెరాయిన్ లభ్యం అయింది. ఈ విషయాన్ని పోలీస్ అధికారి తెలిపారు.

  ఇక BSF పోలీసులు ఇచ్చిన సమాచారంతో రాష్ట్ర పోలీసులు అలెర్ట్ అయ్యారు. స్మగ్లింగ్, డ్రగ్స్ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దసరా, నవరాత్రి వేడుకల సందర్బంగా ఇలాంటి ఘటనలు జరగడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు.

  Published by:Rajasekhar Konda
  First published:

  Tags: India pakistan border

  ఉత్తమ కథలు