హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Chandrayan 3: జాబిల్లిని చేరడానికి ఈ ఏడాది చంద్రయాన్-3 లేనట్టే.. తిరిగి ఎప్పుడంటే..

Chandrayan 3: జాబిల్లిని చేరడానికి ఈ ఏడాది చంద్రయాన్-3 లేనట్టే.. తిరిగి ఎప్పుడంటే..

ఇస్రో చైర్మెన్ కె. శివన్ (ఫైల్)

ఇస్రో చైర్మెన్ కె. శివన్ (ఫైల్)

Chandrayan 3: 2019 సెప్టెంబర్ లో ఇస్రో (isro) ప్రయోగించిన చంద్రయాన్ -2 ప్రయోగం తృటిలో విఫలమైన సంగతి తెలిసిందే. దేశంతో పాటు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన ఈ ప్రాజెక్టు చివరి నిమిషంలో విఫలమైనా ఇస్రో మాత్రం పట్టు వీడకుండా తన ప్రయత్నాలను కొనసాగించింది.

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :

Chandrayan 3: జాబిల్లిని చేరుకోవడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (Isro) తలపెట్టిన చంద్రయాన్ - 3 యాత్ర ఈ ఏడాది లేనట్టే.. ఈ విషయాన్ని స్వయంగా ఇస్రోనే ప్రకటించింది. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా కారణంగా సమస్త రంగాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇస్రో ప్రయోగాలు కూడా ప్రభావితమయ్యాయి. దీంతో గతేడాది జరగాల్సిన ప్రయోగాలన్నీ వాయిదా పడక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.

చంద్రయాన్ -3 వాయిదా పడిన నేపథ్యంలో ఆ ప్రయోగాన్ని తిరిగి 2022లో చేపడతామని ఇస్రో ప్రకటించింది. 2019 సెప్టెంబర్ లో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ -2 ప్రయోగం తృటిలో విఫలమైన సంగతి తెలిసిందే. దేశంతో పాటు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన ఈ ప్రాజెక్టు చివరి నిమిషంలో విఫలమైనా ఇస్రో మాత్రం పట్టు వీడకుండా తన ప్రయత్నాలను కొనసాగించింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే దీనిని గతేడాదే ప్రయోగించాలని ఇస్రో భావించింది. కానీ కరోనా కారణంగా అది సాధ్యపడలేదు. దీంతో ఈ ప్రయోగానికి సంబంధించిన పనులను ఈ ఏడాది లో పూర్తి చేసి వచ్చే ఏడాది పూర్తి స్థాయిలో సిద్ధమవుతామని ఇస్రో తెలిపింది.

ఈ మేరకు ఇస్రో ప్రాజెక్టులపై సంస్థ చైర్మెన్ కె.శివన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇదే విషయమై (చంద్రయాన్ - 3) మేము పరిశోధనలు జరుపుతున్నాం. దీనిలో కూడా చంద్రయాన్ - 2 మాదిరిగానే ఆర్బిటార్ ఉండదు. ఆ ప్రయోగంలో వాడిన ఆర్బిటార్ నే దీనిలోనూ వాడుతున్నాం. ఈ మిషన్ ను వచ్చే ఏడాది లో ప్రయోగించేందుకు ఇస్రో శాస్ర్తవేత్తలు అహర్నిషలు కృషి చేస్తున్నారు..’ అని అన్నారు.

చంద్రయాన్ - 3 తో పాటు భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగన్ యాన్ కు సంబంధించిన విషయాలపైనా శివన్ మాట్లాడారు. ఈ ఏడాది చివర్లో చేపట్టనున్న ఆ ప్రాజెక్టులో వెళ్లనున్న ముగ్గురు భారతీయ వ్యోమగాములు రష్యాలో అవసరమైన శిక్షణ పొందుతున్నామని తెలిపారు. గగన్ యాన్ ముగిసిన తర్వాత మరో మానవ రహిత మిషన్ ను కూడా అంతరిక్షంలోకి పంపిస్తామని శివన్ అన్నారు.

First published:

Tags: Chandrayaan-2, ISRO

ఉత్తమ కథలు