చంద్రుడిపై భారీ బిలాలు..చంద్రయాన్-2 నుంచి మరిన్ని ఫొటోలు

వీటిలో జాక్సన్ అగాథం వ్యాసం 71.3 కిలోమీటర్ల పొడవు ఉన్నట్లు పేర్కొంది. ఆగస్టు 23న 4,375 కిలో మీటర్ల ఎత్తు నుంచి టెరాన్ మ్యాపింగ్ కెమెరా -2 ద్వారా ఆ ఫొటోలను తీసినట్లు ఇస్రో తెలిపింది.

news18-telugu
Updated: August 26, 2019, 7:39 PM IST
చంద్రుడిపై భారీ బిలాలు..చంద్రయాన్-2 నుంచి మరిన్ని ఫొటోలు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 26, 2019, 7:39 PM IST
ఇస్రో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చంద్రయాన్-2 నుంచి ఆశించిన ఫలితాలు వస్తున్నాయి. చంద్రుడి ఉపరితలంపై నుంచి ఇప్పటికే ఒక ఫొటోను భూమికి పంపించిన చంద్రయాన్-2 తాజాగా మరో రెండు చిత్రాలను పంపింది. చంద్రుని ఉపరితలంపై ఉన్న బిలాలను గుర్తించి ఇస్రోకు చేరవేసింది. చంద్రుడిపై జాక్సన్, మాచ్, కొరోలెవ్, మిత్రా అనే నాలుగు బిలాలను గుర్తించినట్లు ఇస్రో ట్విటర్ ద్వారా వెల్లడించింది. వీటిలో జాక్సన్ అగాథం వ్యాసం 71.3 కిలోమీటర్ల పొడవు ఉన్నట్లు పేర్కొంది. ఆగస్టు 23న 4,375 కిలో మీటర్ల ఎత్తు నుంచి టెరాన్ మ్యాపింగ్ కెమెరా -2 ద్వారా ఆ ఫొటోలను తీసినట్లు ఇస్రో తెలిపింది.
జులై 22న చంద్రయాన్-2ని లాంచ్ చేసింది ఇస్రో. కొన్ని రోజుల క్రితమే ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇక చంద్రయాన్-2 మిషన్‌లోని ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌ను సెప్టెంబర్ 7న అర్ధరాత్రి 1.40 నిమిషాలకు చంద్రుడిపై దింపనున్నారు. అత్యంత క్లిష్టమైన ఈ దశను విజయవంతంగా పూర్తి చేస్తే అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో ఇస్రో కొత్త చరిత్రను లిఖించినట్టు అవుతుంది.

First published: August 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...