Chandrayaan 2: చంద్రుని కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-2 ఉపగ్రహం

Chandrayaan 2 | చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన తరువాత కూడా నాలుగు దశలను పూర్తి చేసుకున్న తరువాతే చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడిపై దిగగలుగుతుంది.

news18-telugu
Updated: August 20, 2019, 10:57 AM IST
Chandrayaan 2: చంద్రుని కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-2 ఉపగ్రహం
చంద్రుని కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-2 ఉపగ్రహం, Lunar Orbit Insertion of Chandrayaan2 maneuver was completed successfully today
news18-telugu
Updated: August 20, 2019, 10:57 AM IST
చంద్రయాన్-2లో మరో కీలక ఘట్టం పూర్తయ్యింది. చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్-2 ఉపగ్రహం చేరింది. సరిగ్గా ఇవాళ ఉదయం 9:02 నిమిషాలకు ఉపగ్రహం చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. జూలై 22న చంద్రయాన్-2ను అంతరిక్షంలోని పంపించారు ఇస్రో శాస్త్రవేత్తలు. చంద్రయాన్‌–2 ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడం అత్యంత సవాల్‌తో కూడుకున్న విషయమని ఇస్రో సైంటిస్టులు ఇప్పటికే ప్రకటించారు. విజయవంతంగా ఈ కీలక ఘట్టం పూర్తికావడంతో  ఇస్రో శాస్త్రవేత్తలంతా సంతోషం వ్యక్తంచేస్తున్నారు.


ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ ను ఇస్రో జూలై 22న నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి ప్రయోగించింది. మూడు దశల్లో ఈ చంద్రయాన్-2 కొనసాగుతోంది. ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది.  చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన తరువాత కూడా నాలుగు దశలను పూర్తి చేసుకున్న తరువాతే చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడిపై దిగగలుగుతుంది.




First published: August 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...