• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • CHANDRAYAAN 2 ISRO GIVES CLARITY ON CHAIRMAN K SIVAN SOCIAL MEDIA HANDLES SK

Chandrayaan-2: అవన్నీ ఫేక్.. నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన ఇస్రో

Chandrayaan-2:  అవన్నీ ఫేక్.. నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన ఇస్రో

ప్రతీకాత్మక చిత్రం

శివన్ సోషల్ మీడియా అకౌంట్లలో చంద్రయాన్-2, విక్రమ్ స్టేటస్, ఇస్రో అప్‌డేట్స్‌కు సంబంధించి పోస్టులు ఉండడంతో జనాలు వాటిని ఫాలో అవుతున్నారు. ఐతే దీనిపై ఇస్రో క్లారిటీ ఇచ్చింది.

  • Share this:
    Chandrayaan-2: చంద్రయాన్-2 ప్రయోగం తర్వాత ఇస్రో ఛైర్మన్ కే శివన్ పేరు మార్మోగిపోతోంది. విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ ఆగిపోవడంతో శివన్ కంటతడి పెట్టుకోవడం, ఆయన్ను ప్రధాని మోదీ ఓదార్చడం తెలిసిందే. ఆ దృశ్యాలను చూసిన దేశ ప్రజలు శివన్ కృషిని మెచ్చుకుంటున్నారు. మేమున్నాం సార్.. అంటూ సోషల్ మీడియాలో మద్దతు తెలుపుతున్నారు. మరికొందరైతే ఆయన బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసుకునేందుకు నెట్టింట శోధిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్, ట్విటర్‌ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో శివన్ పేరిట అకౌంట్లు పుట్టుకొచ్చాయి.

    శివన్ సోషల్ మీడియా అకౌంట్లలో చంద్రయాన్-2, విక్రమ్ స్టేటస్, ఇస్రో అప్‌డేట్స్‌కు సంబంధించి పోస్టులు ఉండడంతో జనాలు ఫాలో అవుతున్నారు. వాటిలో ఉన్న సమాచారాన్ని నమ్ముతున్నారు. ఐతే దీనిపై ఇస్రో క్లారిటీ ఇచ్చింది. ఇస్రో ఛైర్మన్ శివన్‌కు వ్యక్తిగతంగా ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్లు లేవని స్పష్టం చేసింది. ఆయా అకౌంట్లో చంద్రయాన్-2, ఇస్రో అప్‌డేట్స్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం వచ్చినా.. అవి అధికారమైనవి కావని, వాటిని నమ్మవద్దని పేర్కొంది. ఇస్రో అధికారిక ఖాతాలో పేర్కొన్న సమాచారానే విశ్వసించాలని సూచించింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు