news18-telugu
Updated: November 2, 2019, 11:05 PM IST
(Credit - Twitter - NASA)
చంద్రయాన్-2 విఫలం అయినప్పటికీ ఆ ప్రయోగం ద్వారా ఎన్నో విషయాలు తెలిశాయని ఇస్రో చైర్మన్ శివన్ వ్యాఖ్యానించారు. విక్రమ్ రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయించటంలో విఫలమైనప్పటికీ, అందులో తమకు ఎంతో విలువైన సమాచారం అందిందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు చివరి వరకూ విక్రమ్ రోవర్లో అన్ని వ్యవస్థలూ సక్రమంగానే పనిచేశాయన్నారు. దీంతో సాఫ్ట్ ల్యాండింగ్‌కు సంబంధించి పొరపాట్లు జరగకుండా పరిశోధన జరిపే అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. అందుకే అదే అనుభవంతో భవిష్యత్తులో చంద్రుడిపై కచ్చితంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తామని శివన్ ధీమా వ్యకం చేశారు. ఐఐటీ ఢిల్లీలో జరిగిన గోల్డెన్ జూబ్లీ కాన్వొకేషన్లో శివన్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.భవిష్యత్తులో తాము మరింత అత్యాధునిక సాంకేతికత కలిగిన ఉపగ్రహాలను ప్రయోగిస్తామని శివన్ అన్నారు.
Published by:
Krishna Adithya
First published:
November 2, 2019, 11:05 PM IST