హోమ్ /వార్తలు /జాతీయం /

Chandrayaan-2: విక్రమ్‌పై నవ్వులు పూయిస్తున్న పోలీసుల ట్వీట్

Chandrayaan-2: విక్రమ్‌పై నవ్వులు పూయిస్తున్న పోలీసుల ట్వీట్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

'విక్రమ్.. ప్లీజ్ స్పందించు' అని నాగ్‌పూర్ సిటీ పోలీస్ విభాగం చేసిన ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Chandrayaan-2: మూడు రోజులైంది. చంద్రమామపై ఉన్న విక్రమ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆర్బిటర్‌కి ల్యాండర్ విక్రమ్ ఆచూకీ దొరికినా.. అక్కడి నుంచి మాత్రం ఎలాంటి సిగ్నల్స్ రావడం లేదు. ఐతే విక్రమ్ ధ్వంసం కాలేదని.. సింగిల్ పీస్‌గానే ఉందని ఇస్రో ప్రకటించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విక్రమ్‌ నుంచి సిగ్నల్స్ పునరుద్ధరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ఇస్రో అధికారులు స్పష్టం చేశారు. దాంతో విక్రమ్ తిరిగి కాంటాక్ట్‌లోకి రావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు. ఈ క్రమంలో విక్రమ్‌పై నాగపూర్ సిటీ పోలీసులు చేసిన ఓ ట్వీట్ నెటిజన్ల హృదయాలను గెలిచింది.

ప్రియమైన విక్రమ్..! దయచేసి స్పందించు..! సిగ్నల్స్‌ని బ్రేక్ చేసినందుకు నీకు చలాన్ వేయబోం.

నాగపూర్ సిటీ పోలీస్ విభాగం

దేశంలో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి రావడంతో నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు పెద్ద మొత్తంలో చలాన్లు పడుతున్నాయి. వేలకు వేలు ఫైన్‌లు పడుతుండడంతో కొందరైతే వాహనాలను పోలీసుల దగ్గరే వదిలివేసి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో చలాన్‌లను చంద్రయాన్‌-2కి ముడిపెట్టి ట్వీట్ చేశారు నాగపూర్ పోలీసులు. 'విక్రమ్.. ప్లీజ్ స్పందించు' అని పోలీసులు చేసిన ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అదుర్స్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరికొందరు మాత్రం పోలీసుల తీరును తప్పుబట్టుతున్నారు. విక్రమ్‌తో సంబంధాలు తెగిపోయి ఇస్రో శాస్త్రవేత్తలు బాధలో ఉంటే.. మీరు జోకులు వేస్తారా అని విమర్శిస్తున్నారు.

First published:

Tags: Chandrayaan-2, ISRO, Traffic challans, Traffic police, Vikram lander

ఉత్తమ కథలు