కేరళలో ఏనుగు మృతిపై చంద్రబాబు ట్వీట్.. మనం మనుషులమేనా.?

చంద్రబాబు ట్వీట్‌పై చాలా మంది స్పందించారు. నిజంగా ఇది బాధాకరం సార్.. అసలు వాళ్లు మనుషులేనా అంటూ చాలా మంది ట్వీట్ చేశారు. మనుషుల్ని నమ్మడం వల్లే...ఆ ఏనుగు ప్రాణాలు కోల్పోయిందని అభిప్రాయపడ్డారు.

news18-telugu
Updated: June 3, 2020, 7:51 PM IST
కేరళలో ఏనుగు మృతిపై చంద్రబాబు ట్వీట్.. మనం మనుషులమేనా.?
కేరళలో ఏనుగు మృతిపై చంద్రబాబు ట్వీట్.. మనం మనుషులమేనా.?
  • Share this:
కేరళలో ఏనుగు మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. బాణాసంచా నింపిన పైనాపిల్ పండు తిని ఏనుగు చనిపోవడం దారుణమని ఆయన అన్నారు. ఇది గుండెలు పగిలే ఘటన అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. మనుషులుగా మేమే నీ ప్రాణాలు తీశామంటూ అందులో పేర్కొన్నారు. చంద్రబాబు ట్వీట్‌పై చాలా మంది స్పందించారు. నిజంగా ఇది బాధాకరం సార్.. అసలు వాళ్లు మనుషులేనా అంటూ చాలా మంది ట్వీట్ చేశారు. మనుషుల్ని నమ్మడం వల్లే...ఆ ఏనుగు ప్రాణాలు కోల్పోయిందని అభిప్రాయపడ్డారు.


కాగా, కేరళలో టపాసులు నింపిన పైనాపిల్ తినడంలో పేలుడు సంభవించి ఏనుగు చనిపోయింది. మలప్పురంలో మే 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ఆడ ఏనుగు ఊరి మీదుగా వెళ్తుండగా కొందరు వ్యక్తులు పైనాపిల్ పండు ఇచ్చారు. దాని నిండా టపాసులు పెట్టి ఏనుగు అందజేశారు. ఆ విషయం తెలియక ఏనుగు పైనాపిల్‌ను తినడంతో పేలుడు సంభవించింది.

పేలుడు ధాటికి ఏనుగు తొండం, నీటితో తీవ్ర గాయాలయ్యాయి. ఆ నొప్పితో ఏమీ తినలేక ఆకలితో ఆలమటించింది. నొప్పి నుంచి ఉపశమనం కోసం వెల్లియార్ నదిలోకి వెల్లి నిలబడింది. రోజుల తరబడి అక్కడే నిలబడిన ఏనుగు.. నీటిని మాత్రమే తీసుకొంది. ఆహారం తీసుకోకపోవడంతో బక్కచిక్కి.. నీటిలోనే ప్రాణాలు వదిలింది. వెటర్నరీ డాక్టర్లు చేరుకొని పోస్టుమార్టం చేయగా.. ఏనుగులో కడుపులో గర్భస్థ ఏనుగు ఉంది. అది కూడా చనిపోయిందని డాక్టర్లు వెల్లడించారు. ఏనుగు మృతి ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలన రేపుతోంది. జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
First published: June 3, 2020, 7:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading