కేంద్ర ఎన్నికల సంఘంతో ముగిసిన చంద్రబాబు బ‌ృందం భేటీ...ఈవీఎం సమస్యలపైనే చర్చ...

సీఎం చంద్రబాబు నేతృత్వంలోని విపక్ష నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోడాతో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో ఈవీఎంల పనితీరు సరిగ్గా లేదని, పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయని ఈసీఐ అధికారుల ముందు లేవనెత్తారు.

news18india
Updated: May 7, 2019, 7:02 PM IST
కేంద్ర ఎన్నికల సంఘంతో ముగిసిన చంద్రబాబు బ‌ృందం భేటీ...ఈవీఎం సమస్యలపైనే చర్చ...
విపక్ష నేతలతో కలిసి ఈసీఐను కలిసిన చందబ్రాబు..
  • Share this:
కేంద్ర ఎన్నికల సంఘంతో సీఎం చంద్రబాబు బృందం భేటీ ముగిసింది. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 21 విపక్ష పార్టీల నేతలతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారులతో చంద్రబాబు భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని విపక్ష నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోడాతో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో ఈవీఎంల పనితీరు సరిగ్గా లేదని, పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయని ఈసీఐ అధికారుల ముందు లేవనెత్తారు. అంతేకాదు విపక్ష పార్టీలు ఎన్నికల్లో ఎదుర్కొన్న ఇబ్బందులను ఎన్నికల సంఘం అధికారులకు నేతలు తెలిపారు. ప్రధానంగా వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు అంశంపై చర్చించారు. ఈ విషయంలో కోర్టు తీర్పునకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. అలాగే మిగిలిన దశల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబుతో పాటు ఈ భేటీలో కాంగ్రెస్ తరపున అభిషేక్ సింఘ్వీ, ఫరూఖ్ అబ్దుల్లా, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్, సీపీఎం, సీపీఐ, ఆర్ఎల్డీ, డీఎంకే నేతలు హాజరయ్యారు.

ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు కోసం రివ్యూ పిటిషన్‌ వాదనల కోసం విపక్ష పార్టీలతో సహా సుప్రీం కోర్టులో హాజరయ్యారు. కాగా సుప్రీం కోర్టులో విపక్షపార్టీల బృందం రివ్యూ పిటిషన్ అంశంలో తీర్పు సవరణకు ఆసక్తిగా లేమని పిటిషన్‌ను న్యాయస్థానం తోసి పుచ్చింది.
First published: May 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading