మోదీని దించాలంటే మనం ఏకమవ్వాలి: దేవెగౌడ, చంద్రబాబు

చంద్రబాబు మళ్లీ ఢిల్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక.. 2019లో 1996 నాటి సీన్ రిపీట్ అవుతుందని కుమారస్వామి అన్నారు.

news18-telugu
Updated: November 8, 2018, 5:49 PM IST
మోదీని దించాలంటే మనం ఏకమవ్వాలి: దేవెగౌడ, చంద్రబాబు
దేవెగౌడ, చంద్రబాబునాయుడు, కుమారస్వామి
news18-telugu
Updated: November 8, 2018, 5:49 PM IST
2019లో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే దేశంలోని అన్ని సెక్యులర్ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని మాజీ ప్రధాని దేవెగౌడ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతి నుంచి బెంగళూరు వెళ్లిన చంద్రబాబు దేవెగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో చర్చించారు. దేశ రాజకీయాల మీద చర్చ జరిగింది. ‘సేవ్ నేషన్ - సేవ్ డెమొక్రసీ’ కోసం అన్ని ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఒక్కతాటి మీదు రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని అన్ని వ్యవస్థలను ఎన్డీయే ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని దేవెగౌడ, చంద్రబాబు ఆరోపించారు.

ఎన్డీయే ప్రభుత్వం గత నాలుగేళ్ల రెండు నెలలుగా పాలించింది. మోదీ ఎన్నో సమస్యలను సృష్టించారు. ఎన్నో సంస్థలను అస్తవ్యస్థం చేశారు. దీన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సహా దేశంలోని అన్ని సెక్యులర్ పార్టీలు ముందుకు రావాలి. ఎన్డీయేను రీప్లేస్ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఈ బాధ్యతను చంద్రబాబు భుజానికి ఎత్తుకున్నారు. ఇప్పటికే కొందరితో మాట్లాడారు. మమత, స్టాలిన్‌తో కూడా చర్చిస్తారు. 2019లో ఎన్డీయేను గద్దె దించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. నేను, కుమారస్వామి కలసి మరోసారి కూర్చుని సమగ్రంగా చర్చిస్తాం. కాంగ్రెస్ కూడా సహకరించాలి.
హెచ్‌డీ దేవెగౌడ, మాజీ ప్రధాని


దేవెగౌడతో భేటీని తన జీవితంలో మర్చిపోలేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రస్తుతం ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయన్న టీడీపీ అధినేత రేపు చెన్నై వెళ్లి స్టాలిన్‌ను కలుస్తున్నట్టు చెప్పారు.మోదీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసింది. సీబీఐ, ఈడీ, ఇన్ కం ట్యాక్స్ లాంటి వాటిని ప్రత్యర్థుల మీదకు ఉసిగొల్పుతోంది. కర్ణాటక, ఏపీ, తెలంగాణ, తమిళనాబు, బెంగాల్‌లో ఏం జరిగిందో చూశాం. నోట్ల రద్దు వల్ల ఫలితం లేదు. ఆర్థిక వ్యవస్థ సమస్యల్లో పడింది. మీడియా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయడానికి భయపడుతోంది. ప్రధాని అభ్యర్థి ఎవరనేది తర్వాత డిసైడ్ చేస్తాం. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు చూశాం. దేశం మొత్తం ఇదే అభిప్రాయంతో ఉంది. జనవరిలో మమతా బెనర్జీ, కుమారస్వామి వేర్వేరు ర్యాలీలు నిర్వహించబోతున్నారు. వాటికి అందర్నీ ఆహ్వానించారు.
చంద్రబాబు, ఏపీ ముఖ్యమంత్రి


చంద్రబాబు మళ్లీ ఢిల్లీ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామం అని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు.
Loading...
సెక్యులర్ పార్టీలను ఏకం చేయాలనే అంశంపై అందరం చర్చించాం. దేవెగౌడ, చంద్రబాబు పాతమిత్రులే. వారి పొలిటికల్ అర్థమెటిక్స్ అద్భుతం. చంద్రబాబు మళ్లీ ఢిల్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక.. 2019లో 1996 నాటి సీన్ రిపీట్ అవుతుంది.
కుమారస్వామి, కర్ణాటక ముఖ్యమంత్రి


1996లో యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్‌గా ఉన్న జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ, కాంగ్రెస్ పార్టీ పరోక్ష మద్దతుతో ప్రధానమంత్రి అయ్యారు. అత్యంత తక్కువ ఎంపీల బలం ఉన్నా కూడా ఆయన ప్రధాని పదవిని చేపట్టారు.

దేవెగౌడ, చంద్రబాబు భేటీ ఫొటోలు

First published: November 8, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...