హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Farmers Protest: నేడే రైతుల చక్కా జామ్.. ఢిల్లీలో మళ్లీ ఏం జరగబోతోంది?

Farmers Protest: నేడే రైతుల చక్కా జామ్.. ఢిల్లీలో మళ్లీ ఏం జరగబోతోంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Farmers Chakka Jam: చక్కా జామ్ నుంచి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాలను మాత్రం మినహాయించారు. అక్కడ చక్కా జామ్ జరగదని.. దేశంలోని మిగతా అన్ని ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతాయని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు.

సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 70 రోజులకు పైగా రోడ్లపై బైఠాయించినా.. 11 దఫాలుగా కేంద్రంతో చర్చలు జరిపానా.. ప్రభుత్వ పెద్దల నుంచి సానుకూల ప్రకటన రాకపోవడంతో రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఈ క్రమంలోనే నేడు చక్కా జామ్‌కు పిలుపునిచ్చారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అన్ని రాష్ట్రాల్లో జాతీయ రహదారుల దిగ్బంధం చేస్తామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా రైతులు, వారికి మద్దతు తెలిపే సంఘాలు ఈ కార్యక్రమంలో శాంతియుతంగా పాల్గొంటారని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. ఐతే చక్కా జామ్ నుంచి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాలను మాత్రం మినహాయించారు. అక్కడ చక్కా జామ్ జరగదని.. దేశంలోని మిగతా అన్ని ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతాయని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు.

''మాకు ఢిల్లీ నుంచి ఎప్పుడైనా పిలుపు రావొచ్చు. అందుకే ఢిల్లీలో చక్కా జామ్ చేయవద్దని నిర్ణయించాం. యూపీ, ఉత్తరాఖండ్‌లో హింసాత్మక ఘటనలకు పాల్పడేందుకు కొందరు కుట్ర చేస్తున్నట్లు మాకు అంతర్గత సమాచారం ఉంది. అందుకే ఆ రెండు రాష్ట్రాల్లోనూ చక్కా జామ్ నిర్వహించడం లేదు. రైతలు ఆందోళనలు చేస్తున్న ప్రాంతాలు మినహా ఢిల్లీ వెళ్లే మిగతా అన్ని రోడ్లు తెరచుకునే ఉంటాయి.'' అని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ తెలిపారు.

జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా హింసాత్మక ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో... ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. మళ్లీ అలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఢిల్లీ శివార్లలలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక రైతులు ఆందోళనలు చేస్తున్న సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌లో భారీగా భద్రతా దళాలు మోహరించాయి. ఢిల్లీ వ్యాప్తంగా 50వేల మంది సిబ్బంది మోహరించినట్లు అధికారులు తెలిపారు. ఇక చక్కా జామ్ నేపథ్యంలో రోడ్లపై పెద్ద ఎత్తున బారీకేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు.


రిపబ్లిక్ డే రోజున ఆందోళనకారులు ఎర్రకోటలోని దూసుకెళ్లి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. మళ్లీ అలాంటి ఘటన పునరావృతం కాకుండా ముందు ఏర్పాట్లు చేశారు.


ఢిల్లీ శివార్లలో 70 రోజులకు పైగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. జనవరి 26 జరిగిన హింసాత్మక ఘటనల తర్వాత కొన్ని సంఘాలు ఉద్యమం నుంచి తప్పుకున్నా.. మిగిలిన సంఘాలు మాత్రం తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాయి. తమతో ఎవరూ కలిసి వచ్చినా రాకున్నా.. రైతులత కోసం ఆందోళనలను కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. బడ్జెట్‌లో మద్దతు ధర గురించి ప్రకటన వస్తుందని ఆశించిన రైతులు సంఘాలు.. అలాంటిదేమీ రాకపోవడంతో కేంద్రంపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు.

First published:

Tags: Delhi, Farmers, Farmers Protest, New Agriculture Acts

ఉత్తమ కథలు