CHAATTISGARH BJP MLA BHIMA MANDAVI WIFE OJASWI PARTICIPATED IN VOTING AK
భర్త చనిపోయి నాలుగు రోజులైంది... అయినా ఓటింగ్‌లో పాల్గొన్న మహిళ
బీజేపీ ఎమ్మెల్యే భీమా మందావి భార్య ఓజస్వి
మూడు రోజుల క్రితం మావోయిస్టుల దాడిలో చనిపోయిన ఛత్తీస్‌గఢ్ బీజేపీ ఎమ్మెల్యే భీమా మందావి భార్య ఓజస్వి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళవారం దంతెవాడ జిల్లాలో జరిగిన దాడిలో భీమాతో పాటు ఐదుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు.
ఆమె భర్త చనిపోయి పట్టుమని వారం రోజులు కూడా గడవలేదు. కానీ... ఓటు వేసే విషయంలో తన బాధ్యతను మరువలేదు ఆ మహిళ. కొద్దిరోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు సృష్టించిన మారణహోమానికి బలైన బీజేపీ ఎమ్మెల్యే భీమా మందావి భార్య ఓజస్వి... ఈ రోజు లోక్ సభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భర్త చనిపోయిన బాధను దిగమింగుతూ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన ఓజస్వికి పోలింగ్ బూత్‌లోని ఓటర్లు సానుభూతి తెలిపారు. గత మంగళవారం ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తున్న బీజేపీ భీమా మందావి కాన్వాయ్ లక్ష్యంగా మందుపాతర పేల్చారు.
మావోయిస్టుల దాడిలో దంతెవాడ భీమా మందావి సహా ఆరుగురు పోలీసులు చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. కౌకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్యామగిరి సమీపంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి అదనపు బలగాలు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు 36 గంటల ముందు ఈ ఘటన జరగడంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.