రాష్ట్రాలకు చెల్లించాల్సిన పన్ను ఆదాయాన్ని ఒక నెల ముందుగానే బదిలీ చేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించారు. 15 మంది ముఖ్యమంత్రులు, ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్‌లు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్న వర్చువల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత ఆర్థిక వృద్ధిని మరింత బలోపేతం చేసి రెండంకెల దిశగా మార్చేందుకు గల మార్గాలపై మేధోమథనం చేస్తున్నారు. కాగా, మౌలిక సదుపాయాల వ్యయం, ఆర్థిక వృద్ధిని పెంచడానికి ప్రతినెలా అన్ని రాష్ట్రాలకు పన్ను ఆదాయాన్ని పంచుతోంది కేంద్ర ప్రభుత్వం.
రెండంకెల వృద్ది లక్ష్యంగా..
కరోనా సెకండ్ వేవ్ తర్వాత... మేం బలమైన వృద్ధిని చూస్తున్నాం. వృద్ధిని వీలైనంత దగ్గరగా రెండంకెలకు తీసుకువెళ్లే ఆలోచన చేస్తున్నాం. ఇందుకోసం రాష్ట్రాలు, కేంద్రం కలిసి పనిచేయాలి. పెట్టుబడులు, తయారీ కార్యకలాపాలను ఎలా వేగవంతం చేయాలనే దానిపై మేము రాష్ట్రాల నుంచి ఆలోచనలను కూడా కోరామని నిర్మలా సీతారామన్ అన్నారు. రాష్ట్రాలు లేవనెత్తిన డిమాండ్లు మరియు సమస్యల గురించి మాట్లాడిన సీతారామన్ ‘‘కొన్ని రాష్ట్రాలు ప్రాజెక్టులకు అనుమతులు, కాంట్రాక్టుల అవార్డు తర్వాత మెరుగైన వివాద పరిష్కార యంత్రాంగాలు, మెరుగైన రహదారుల అనుసంధానం వంటివి కోరాయి.” అని ఆమె చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలు తక్షణ ఉద్యోగాల కల్పన, ఈ ప్రాంతానికి అంతర్జాతీయ వాణిజ్య విధానాల కోసం సహాయం కోరినట్లు పేర్కొన్నారు. ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ ఉత్పత్తికి సంబంధించిన విధానం ఆవశ్యకత కూడా సమావేశంలో ప్రదానంగా చర్చించినట్లు నిర్మలా చెప్పుకొచ్చారు.
రాష్ట్రాలకు జీఎస్‌టీ నష్టపరిహారం
2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీఎస్‌టీ నష్టపరిహారాన్ని కేంద్రం నవంబర్ తొలినాళ్లలో రాష్ట్రాలకు చెల్లించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆయా రాష్ట్రాలమూలధన వ్యయాన్ని పెంచేందుకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నుల పంపిణీలో భాగం కావడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని సీతారామన్ అన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా మొత్తంగా 41% ఉంటుందని 15వ ఆర్థిక సంఘం నిర్ణయించింది. సాధారణంగా ఇది ఒక ఆర్థిక సంవత్సరంలో 14 వాయిదాల బదిలీ వెసులుబాటు ఉంది. బదిలీల బడ్జెట్ అంచనా... సవరించిన అంచనాల మధ్య సర్దుబాటు మార్చిలో నిర్ణయిస్తారు. నవంబర్‌లోఒక ఇన్‌స్టాల్‌మెంట్‌కు బదులుగా రెండు విడతలు బదిలీ అవుతాయి.
రేవంత్ రెడ్డి ప్లాన్‌కు గండికొడుతున్న ఈటల రాజేందర్.. ఆ నేత విషయంలో..
Ghee: మీరు వాడే నెయ్యి మంచిదేనా ? కల్తీ జరిగిందో లేదో ఇలా తెలుసుకోండి
రాష్ట్రాల సహాయం అవసరం...
వచ్చే సంవత్సరాల్లో దేశాన్ని వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రాల సహాయాన్ని కోరారు. పెట్టుబడి ఆకర్షణను సులభతరం చేయడం, వ్యాపారాన్ని సులభతరం చేయడం, డిస్కమ్ నష్టాలను తగ్గించడానికి విద్యుత్ సంస్కరణలను చేపట్టడం ద్వారా ఈ ఫలితాన్ని పొందవచ్చని తెలిపారు. రాష్ట్రాలు భూసేకరణ విధానాలను సరళీకృతం చేయాలని నిర్మల కోరారు. పెట్టుబడి సమయంలో ట్యాప్ చేసే ల్యాండ్ బ్యాంక్‌లను సృష్టించాలని ఆమె సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.