PM Kishan Scheme: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఆ పథకం డబ్బులు ఎప్పుడు జమ అవుతాయంటే...

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోని రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మంత్రి కిసాన్ పథకం కింద పెట్టుబడి సాయం కోసం రైతులకు అందించే మొత్తాన్ని ఈ విడతలో భాగంగా ఆగస్ట్ 9న విడుదల చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.

  • Share this:
    న్యూఢిల్లీ: దేశంలోని రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మంత్రి కిసాన్ పథకం కింద పెట్టుబడి సాయం కోసం రైతులకు అందించే మొత్తాన్ని ఈ విడతలో భాగంగా ఆగస్ట్ 9న విడుదల చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ విడతలో రూ.19,000 కోట్లను 9 కోట్ల మందికి పైగా రైతులకు కేంద్రం అందించనుంది. రైతులకు ఆసరాగా నిలిచే ఉద్దేశంతో పెట్టుబడి సాయం కోసం 2019లో కేంద్రం ప్రధాని మంత్రి కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 5 ఎకరాల లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఏడాదికి రూ.6000 పెట్టుబడి సాయాన్ని కేంద్రం మూడు విడతల్లో అందిస్తోంది. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి కేంద్రం అర్హులైన రైతుల ఖాతాలో రూ.2 వేల సాయాన్ని జమ చేస్తోంది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకూ 1.15 లక్షల కోట్లను కేంద్రం రైతులకు సాయంగా అందించింది.
    Published by:Sambasiva Reddy
    First published: