Home /News /national /

CENTRE TO BEGIN COVID 19 VACCINATION FOR 12 14 YEARS OLD AND PRECAUTION DOSE FROM MARCH 16 AK

కరోనా ముందు జాగ్రత్త డోసుపై కేంద్రం కీలక ప్రకటన.. ఆ రోజు నుంచే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వ్యాక్సిన్, ముందు జాగ్రత్త డోసు విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

    దశలవారీగా అన్ని వర్గాలు, వయసుల వారికి కరోనా వ్యాక్సిన్, ముందు జాగ్రత్త డోసు వేయాలని నిర్ణయించుకున్న కేంద్రం.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 12-14 ఏళ్లలోపు వారికి కరోనా టీకాలు వేయడం, 60 ఏళ్లు పైబడిన వారందరికీ ముందు జాగ్రత్త డోసులు వేసే ప్రక్రియను మార్చి 16 నుంచి ప్రారంభించబోతోంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా తెలిపారు. దేశంలో 80 శాతం మంది పెద్దలకు కరోనా(Covid-19) వ్యాక్సిన్ రెండు డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ గతంలోనే స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 175 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయగా..వాటిలో 96.5 శాతం టీకాలు అర్హులైన వారు తొలి డోసు తీసుకున్నారు. ఇక అర్హులైన వయోజనులు 80 శాతం మంది రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్(Vaccine) తీసుకున్నారని కేంద్ర మంత్రి తెలిపారు.

    జనవరి 2021 నుంచి దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతుండగా.. దశల వారీగా జరిపిన ప్రయోగాల అనంతరం ఒక్కో వయసుల వారికీ టీకా అర్హతను నిర్దారించారు. ఈక్రమంలో ఈ ఏడాది జనవరి నుంచి 15-18 ఏళ్ల వారికి కోవిడ్ టీకా అందిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 2 కోట్ల మంది యువతకు రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.

    ఇదిలా ఉంటే దేశంలో కరోనా థర్డ్‌వేవ్(Covid 19 Third Wave) అనంతరం రోజువారీ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల ఐదు వేలకు దిగువగానే కేసుల సంఖ్య నమోదవుతోంది. మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గుతోంది. 50 కంటే దిగువన మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,503 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా నిన్న 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 0.47 శాతం ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

    Barack Obama: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కరోనా.. క్షేమం కోరుతూ PM Modi ట్వీట్

    Lockdown In China : కరోనా విజృంభణ..చైనాలోని మరో నగరంలో లాక్ డౌన్

    దేశంలో ప్రస్తుతం 36,168 (0.08%) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజా కేసులతో దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,24,43,952కి పెరిగాయి. ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,15,877 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.72 శాతానికిపైగా ఉంది. ఇప్పటివరకు దేశంలో 180.19 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు దాదాపు 77.90 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నిన్న దేశవ్యాప్తంగా 5,32,232 కరోనా పరీక్షలు చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Corona Vaccine

    తదుపరి వార్తలు