Traffic Rule Changes: ట్రాఫిక్ రూల్స్‌లో మార్పులు చేస్తున్న కేంద్రం.. పాటించకపోతే భారీ జరిమానాలు..

ప్రతీకాత్మక చిత్రం

Traffic Rule Changes: కేంద్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టం చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. తాజాగా టూవీలర్ డ్రైవింగ్ విషయంలో కొన్ని కొత్త నిబంధనను ప్రతిపాదిస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • Share this:
కేంద్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో ట్రాఫిక్​ నిబంధనలను కట్టుదిట్టం చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. తాజాగా టూవీలర్(Two Wheeler)​ డ్రైవింగ్​ విషయంలో కొన్ని కొత్త నిబంధనను ప్రతిపాదిస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్​ విడుదల చేసింది. నాలుగేళ్లలోపు పిల్లలను టూవీలర్​పై కూర్చోబెట్టుకొని గంటకు 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నడపరాదని, ఒకవేళ, అలా నడిపితే ట్రాఫిక్ నిబంధనల(Traffic Rules) ఉల్లంఘనగా పరిగణించిస్తామని తాజాగా విడుదల చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్​లో పేర్కొంది. పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా(Road Transport) మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

అంతేకాదు, తొమ్మిది నెలల నుండి నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలను టూవీలర్​పై తీసుకెళ్తున్నప్పుడు తప్పనిసరిగా క్రాష్ హెల్మెట్‌లు, సేఫ్టీ హానెస్‌లు ధరించాలని తాజా ముదాయిదాలో ప్రతిపాదించింది. ఒకవేళ, వాహనదారులు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. 1,000 జరిమానాతో పాటు మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయాలని ప్రతిపాదించింది. తాజా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం, నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను బైక్​పై తీసుకెళ్లే క్రమంలో డ్రైవర్‌కు పిల్లలను అటాచ్ చేయడానికి సేఫ్టీ హార్నెస్ ఉపయోగించాలి.

సేఫ్టీ హానెస్ అనేది చొక్కాకు జత పట్టీల వలే ఉంటాయి. తద్వారా పిల్లలు కింద పడకుండా కాపాడుకోవచ్చు. అయితే, ఈ సేఫ్టీ హానెస్​ అనేది తప్పనిసరిగా అధిక సాంద్రత గల భారీ నైలాన్ లేదా మల్టీఫిలమెంట్ నైలాన్ మెటీరియల్‌తో తయారు చేయసి ఉండాలి. ఇది సుమారు 30 కిలోల వరకు బరువు ఉండేలా రూపొందించాలి. అయితే, ప్రస్తుతానికి ఇవి ప్రతిపాదనలు మాత్రమేనని, సంప్రదింపుల తర్వాత తుది నోటిఫికేషన్ జారీ చేస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది. నోటిఫికేషన్​ జారీ చేసిన ఏడాది తర్వాత నిబంధనలను అమల్లోకి తెస్తామని స్పష్టం చేసింది.

Maida Flour: మైదా పిండి అనేక ఆరోగ్య సమస్యలు కారణమని మీకు తెలుసా ?

After Eating: భోజనం చేసిన తరువాత ఈ పనులు చేయొచ్చా ? నిపుణులు ఏం చెబుతున్నారు ?

పిల్లలకు సైతం హెల్మెట్​ పెట్టాలి..
కాగా, భారతదేశం, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో టూవీలర్లు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని ముసాయిదాలో పేర్కొంది. అందుకే, నిబంధనలు కఠినతరం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. “ప్రజలు తమ పిల్లలను చాలా అసురక్షిత పద్ధతిలో తీసుకెళ్తున్నారు. నిత్యం మన రోడ్లపై ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో ఎక్కువ శాతం హెల్మెట్‌ లేకపోవడం వల్లే జరుగుతున్నాయి. అందుకే టూవీలర్​పై పిల్లలను తీసుకెళ్తున్నప్పుడు అనేక జాగ్రత్తలు పాటించాలి. డ్రైవర్​తో వెనకాలే కూర్చున్న పిల్లలు కూడా హెల్మెట్​ ధరింపజేయాలి. అప్పుడే ప్రమాదాలను ఆపగలం.’’ అని ఇండియా రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్‌కు చెందిన దీపాంశు గుప్తా అన్నారు. ప్రస్తుతం, భారతదేశంలో రోడ్డు ప్రమాదాల్లో నాలుగేళ్లలోపు ఎంత మంది పిల్లలు మరణించారనే దానిపై నిర్దిష్ట సమాచారం లేదు. ప్రభుత్వం అన్ని రాష్ట్రాల నుండి డేటాను సేకరిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published: