హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

నిజాముద్దీన్ మర్కజ్‌ ఘటనపై కేంద్రం సీరియస్...

నిజాముద్దీన్ మర్కజ్‌ ఘటనపై కేంద్రం సీరియస్...

భారత హోంశాఖ(ప్రతీకాత్మక చిత్రం)

భారత హోంశాఖ(ప్రతీకాత్మక చిత్రం)

నిజాముద్దీన్ మర్కజ్‌ ఘటనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

నిజాముద్దీన్ మర్కజ్‌ ఘటనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మర్కజ్ ఘటనను అంతర్జాతీయంగా లేవనెత్తాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. మర్కజ్‌కు హాజరైన విదేశీయుల సమాచారాన్ని సేకరించిన కేంద్ర ప్రభుత్వం... వారి వివరాలను ఆయా దేశాలకు అందించింది. ఆయా దేశాలకు సంబంధించిన దౌత్యవేత్తలకు భారత విదేశాంగ శాఖ ఈ వివరాలు అందజేసింది. టూరిస్ట్ వీసాలపై వచ్చి మతప్రచారంలో పాల్గొన్నారని కేంద్రం వారికి వివరించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయా దేశాల దౌత్యవేత్తలకు తెలియజేసింది. ఈ రకంగా వారంతా వీసా నిబంధనలు ఉల్లంఘించారని భారత్ విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.

నిజాముద్దీన్‌లో మర్కజ్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో కూడా చిల్లా కార్యక్రమం నిర్వహణపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. వారిపై చర్యలకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్ సమావేశంలో పాల్గొన్న విదేశీయుల ద్వారానే ఆ సమావేశంలో పాల్గొన్న ఇతరులకు కూడా కరోనా వైరస్ సోకింది. వారి ద్వారా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందింది. దీంతో ఘటనపై సీరియస్’గా దృష్టి పెట్టిన కేంద్రం... మర్కజ్‌లో పాల్గొన్న విదేశీయులపై చర్యలు తీసుకోవాలనే అంశంపై దృష్టి సారించింది.

First published:

Tags: Coronavirus, Covid-19, Union Home Ministry

ఉత్తమ కథలు