CENTRE SENSATIONAL DECISION FREE RATION EXTENSION TILL MARCH BENFIT TO 80 CRORE PEOPLE SAYS ANURAG THUKUR EVK
Free Ration scheme: కేంద్రం సంచలన నిర్ణయం.. ఉచిత రేషన్ పొడిగింపు.. 80 కోట్ల మందికి లబ్ధి.. ఎప్పటిదాకంటే
ప్రతీకాత్మక చిత్రం
Free Ration scheme: కేంద్రం సంచలన నిర్ణయం తీసుకొంది. దేశ వ్యాప్తంగా ఉచిత రేషన్ పథకాన్ని మార్చి 2022 వరకు పొడిగించాలని కేంద్ర మంత్రివర్గం (Central Cabinet) నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
కేంద్రం మరో సంచల నిర్ణయం తీసుకొంది. ఉచిత రేషన్ పథకాన్ని మార్చి 2022 వరకు పొడిగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం తెలిపారు. కరోనావైరస్ (Corona Virus) మహమ్మారి సమయంలో పేదల కోసం సామాజిక భద్రత (Social Security) కోసం ప్రారంభించిన ఉచిత రేషన్ (Free Rashan) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించదని ఆయన పేర్కొన్నారు. దేశంలో కోవిడ్-19 కారణంగా ఏర్పడిన ఇబ్బందులను అధిగమించేందుకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMKGAY)ని గత ఏడాది మార్చిలో ప్రకటించారు. ప్రారంభంలో, స్కీమ్ ఏప్రిల్-జూన్ 2020 కాలానికి ప్రారంభించబడింది, కానీ తరువాత నవంబర్ 30, 2021 వరకు పొడిగించారు. PMGKAY కింద, 80 కోట్ల మందికి పైగా ప్రజలకు నెలకు 5 కిలోల ఉచిత గోధుమలు/బియ్యంతో పాటు ప్రతి కుటుంబానికి నెలకు 1 కిలోల ఉచితంగా అందజేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ధరల నియంత్రణకు ఉపయుక్తం..
దేశంలో 80 కోట్ల మందికిపైగా రేషన్ కార్డుదారులకు లబ్ధి చేకూర్చే ఉచిత రేషన్ జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద అందిస్తున్నారు. దేశీయ మార్కెట్లో లభ్యతను మెరుగుపరచడానికి, ధరలను నియంత్రణ చేయడానికి ప్రభుత్వం OMSS విధానంలో బల్క్ వినియోగదారులకు బియ్యం, గోధుమలను అందిస్తోంది.
కేంద్రం ఇప్పటికే మూడు వ్యవసాయ చట్టాలను (Three Farm Laws) రద్దు చేసేందుకు క్యాబినెట్ లాంఛనాలను కూడా పూర్తి చేసిందని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ‘‘రాబోయే పార్లమెంట్ (Parliament) సమావేశాల్లో ఈ మూడు చట్టాలను వెనక్కి తీసుకోవడమే మా ప్రాధాన్యత’’ అని ఠాకూర్ అన్నారు.
కోవిడ్ సమయంలో అండగా..
2020లో కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (Prime Minster gareeb kalyan yojana)కింద పేదలు అందరికీ.. ఎవరికైతే రేషన్ కార్డు (Ration Card)ఉంటుందో వారందరికి ఉచితంగా బియ్యం (Free Rice)అందించాలని నిర్ణయం తీసుకుంది.
దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బియ్యం అందిస్తున్నాయి వివిధ పథకాల రూపంలో.. దానికి అదనంగా కేంద్రం కూడా ఉచిత బియ్యాన్ని అందిస్తోంది. దీంతో ఇంతకాలం పేద ప్రజలు ఆ బియ్యం తీసుకుని హ్యాపీగా ఉంటున్నారు.. ఈ స్కీమ్‌ను ప్రభుత్వం మరికొంత కాలం పొడగించనుంది దీంతో 80 కోట్ల మందికి మేలు జరుగుతుంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.