కేంద్రం సంచలన ప్రతిపాదన, ఉద్యోగులకు షాక్

Parliament ( ప్రతీకాత్మకచిత్రం)

300 కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీ తమ సంస్థలో ఎవరినైనా తీసేయాలనుకుంటే ప్రభుత్వానికి చెప్పాల్సిన పనిలేకుండానే తీసేయవచ్చు.

  • Share this:
    కంపెనీలకు భారీ ఊరట, ఉద్యోగులకు భారీ షాక్ కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లులో ప్రతిపాదనలు చేయనుంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ ఈ రోజు కొత్త బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ బిల్ 2020లో కేంద్రం తెస్తున్న తాజా ప్రతిపాదన ప్రకారం 300 కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీ తమ సంస్థలో ఎవరినైనా తీసేయాలనుకుంటే ప్రభుత్వానికి చెప్పాల్సిన పనిలేకుండానే తీసేయవచ్చు. గతంలో ఇది 100 మంది కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు కొత్తవారిని తీసుకోవాలన్నా, పాతవారిని తీసేయాలన్నా తమకు నచ్చినట్టుగా చేయవచ్చు. తాజాగా, దీన్ని 300 మంది వరకు ఉండే కంపెనీలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ బిల్ 2019 గత ఏడాది లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే, ఆ బిల్లును కార్మిక శాఖపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపారు. ఆబిల్లును ఉపసంహరించిన కేంద్ర మంత్రి కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. అయితే, కంద్రం తెస్తున్న ప్రతిపాదన మీద అప్పట్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ట్రేడ్ యూనియన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: