Onion Price: కేంద్రం బంపర్ ఆఫర్‌.. రాష్ట్రాలకు రూ. 26కే కిలో ఉల్లి

భారీ వర్షాలు, వరదల కారణంగా దేశంలో ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. పలు ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర 100 రూపాయలు దాటింది.

news18-telugu
Updated: October 24, 2020, 9:57 AM IST
Onion Price: కేంద్రం బంపర్ ఆఫర్‌.. రాష్ట్రాలకు రూ. 26కే కిలో ఉల్లి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారీ వర్షాలు, వరదల కారణంగా దేశంలో ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. పలు ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర 100 రూపాయలు దాటింది. ఈ నేపథ్యంలో ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా తాజాగా కేంద్ర ప్రభుత్వ ముందస్తు నిల్వల(బఫర్ స్టాక్‌) నుంచి ఉల్లిని తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. "పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రణకు మేము చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా బఫర్ స్టాక్ నుంచి ఉల్లిని తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరాం. అస్సాం, ఆంధ్రప్రదేశ్, బిహార్, చంఢీఘర్, హరియాణా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు బఫర్ స్టాక్ నుంచి 8వేల టన్నుల ఉల్లిని తీసుకోవడానికి ఆసక్తి చూపాయి" అని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి లీనా నందన్‌ తెలిపారు.

మహారాష్ట్రలోని నాశిక్ వద్ద ఉన్న బఫర్ స్టాక్ నుంచి కిలో ఉల్లిని సేకరణ ధరకే రూ. 26 నుంచి రూ. 28 కేంద్రం సరఫరా చేస్తుందని ఆమె చెప్పారు. అయితే రాష్ట్రాలు వాటిని అక్కడి నుంచి సొంతంగా ట్రాన్స్‌పోర్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ రాష్ట్రాలకే నేరుగా సరఫరా చేస్తే కిలో రూ. 30గా ఉంటుందని పేర్కొన్నారు. నాశిక్‌లోని ఈ ఎన్‌ఏఎఫ్‌ఈడీ.. ప్రభుత్వం తరఫున ఉల్లిని సేకరించి నిల్వచేయడమే కాకుండా.. దేశంలోని హోల్‌సేల్ మండీలకు ఉల్లిని సరఫరా చేస్తోందని ఆమె తెలిపారు. ఇక, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం అక్టోబర్ 22వ తేదీన కిలో ఉల్లి ముంబైలో 86 రూపాయలు, చెన్నైలో 83 రూపాయలు, కోల్‌కతాలో 70 రూపాయలు, ఢిల్లీలో 55 రూపాయలుగా ఉంది.

ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్రం ఇప్పటికే పలు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఉల్లి ఎగుమతులపై ఇప్పటికే నిషేధం విధించింది. అలాగే ఉల్లి నిల్వలపై ఆంక్షలు విధించింది. రిటైల్ వ్యాపారులు రెండు టన్నుల వరకు మాత్రమే ఉల్లి కలిగి ఉండాలని, హోల్‌సేల్‌ వర్తకులు 25 టన్నులకు మించి నిల్వలు కలిగి ఉండకూదని స్పష్టం చేసింది.
Published by: Sumanth Kanukula
First published: October 24, 2020, 8:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading