హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్ లో ఇక ఎవరైనా భూములు కొనొచ్చు.. కేంద్రం సంచలన నిర్ణయం

Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్ లో ఇక ఎవరైనా భూములు కొనొచ్చు.. కేంద్రం సంచలన నిర్ణయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జమ్మూ కశ్మీర్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి జమ్మూ కశ్మీర్ లో భారత దేశానికి చెందిన ఏ పౌరుడైనా అక్కడ భూములను కొనుగోలు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.

  జమ్మూ కశ్మీర్, లఢక్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఏ పౌరుడైనా అక్కడ భూములు కొనుగోలు చేయడానికి మార్గం సుగమం చేసింది. అక్కడ భూములను కొనుగోలు చేసే విధానంపై మోదీ సర్కార్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి జమ్మూ కశ్మీర్ లో భారత దేశానికి చెందిన ఏ పౌరుడైనా అక్కడ భూములను కొనుగోలు చేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అములోకి వస్తాయని స్పష్టం చేసింది. అక్కడ నివాసం ఉండే అవకాశాన్ని సైతం అందరికీ ప్రభుత్వం కల్పించింది. కాగా.. వ్యవసాయ భూములను ఇందులో నుంచి మినహాయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

  జమ్మూ కశ్మీర్ పునర్వ్యవ్యస్థీకరణ చట్టం ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి. జమ్మూ కశ్మీర్ ప్రాంతానికి చెందని వారు కూడా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నది తమ ఆకాంక్ష అని ప్రభుత్వం స్పష్టం చేసింది. పారిశ్రామిక భూముల్లో పెట్టుబడులు అవసరమని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అభిప్రాయపడ్డారు. ఆగష్టు 5, 2019 న జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చిని విషయం తెలిసిందే. తద్వారా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం జమ్మూ కాశ్మీర్, మరియు లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడింది. పూర్వపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించబడిన ఆర్టికల్ 370ని అదే రోజు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Jammu and Kashmir, Jammu and kashmir bifurcation

  ఉత్తమ కథలు