కేంద్రం దగ్గర భారీగా పెండింగ్ ఫైల్స్.. క్లియర్ చేసేందుకు మెగా డ్రైవ్.. క్లియర్ చేస్తే రెండు రాష్ట్రపతి భవనాల సైజు స్థలం ఖాళీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వ కార్యాలయాలు పాత ఫైల్స్ తో నిండిపోవడం మనం చూస్తూనే ఉంటాం. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇందుకు భిన్నంగా లేవు. అందుకే అక్టోబర్ క్లీన్ అప్ ద్వారా నెలాఖరు నాటికి పనికిరాని ఫైల్స్ తీసిపడేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు.

  • Share this:
ప్రభుత్వ కార్యాలయాలు పాత ఫైల్స్ తో నిండిపోవడం మనం చూస్తూనే ఉంటాం. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇందుకు భిన్నంగా లేవు. అందుకే అక్టోబర్ క్లీన్ అప్ ద్వారా నెలాఖరు నాటికి పనికిరాని ఫైల్స్ తీసిపడేయాలని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఆదేశించారు. ఇలా చేయడం ద్వారా కేంద్రానికి రెండు రాష్ట్రపతి భవనాల (Rashtrapati Bhavan) సైజు స్పేస్ అంటే, 3.18 లక్షల చదరపు అడుగుల ఖాళీ కార్యాలయ స్థలం అందుబాటులోకి రానుందని అంచనా. పనికిరాని దస్త్రాలు స్క్రాప్ చేయడం ద్వారా కేంద్రానికి రూ.4.29 కోట్ల ఆదాయం వస్తుందని తెలుస్తోంది. ఫైల్స్ పెండింగ్ లో పర్యావరణ శాఖ (Environment)  ముందు వరుసలో నిలిచింది. ఈ శాఖలో 99000 వేల ఫైల్స్ తొలగించాల్సినవి ఉన్నాయి. హోంశాఖలో 81000, సీబీఐ, సీబీడీటీ లో 50000 ఫైల్స్ గుర్తించారు.

ఎంపీల రిఫరెన్సులే ఎక్కువ
ఎంపీల నుంచి వచ్చిన రిఫరెన్స్ ఫైల్స్, పార్లమెంటరీ అస్యూరెన్సు ఫైల్స్ అనేకం కేంద్ర కార్యాలయాల్లో మూలనపడి ఉన్నాయి. ఇలా వచ్చిన ఫైల్స్ 15 రోజుల్లో క్లియర్ చేయాల్సి ఉంది. ఇలా మొత్తం వివిధ మంత్రిత్వ శాఖల కార్యాలయాల్లో 10,273 ఫైల్స్ ఉండగా, 5,500 ఫైల్స్ క్లియర్ చేశారని న్యూస్ 18 పరిశీలనలో తేలింది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్ కార్యాలయాల్లో అత్యధిక ఫైల్స్ పెండిగ్లో ఉన్నాయి.రైల్వే శాఖలో 2,700 ఉండగా 1700 ఇప్పటికే తొలగించారు. రోడ్లు, హైవేల మంత్రిత్వ శాఖలో 900 ఫైల్స్ పెండింగ్​లో ఉన్నాయి. వీటిలో 400 దస్త్రాలకు సమాధానం ఇచ్చారు. పార్లమెంటరీ అస్యూరెన్సుల్లో మొత్తం 2340 ఉండగా, 659 క్లియర్ చేశారు.

ప్రజా సమస్యల దస్త్రాలే ఎక్కువ
ప్రజల నుంచి వచ్చిన గ్రీవిన్స్ ఫైల్స్ 45 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంది. అయితే మొత్తం 74,806 ఫైల్స్ అందగా, వీటిల్లో 22,784 పరిష్కరించారు. మరో 50000 ఫైల్స్ తొలగించారు.

ప్రధాని ఆదేశం
అక్టోబర్ 2 నుంచి 31 వరకు అవసరం లేని దస్త్రాలు తొలగించేందుకు మెగా డ్రైవ్ చేపట్టారు. ప్రధాని ఆదేశాల మేరకు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి అన్ని శాఖలకు లేఖలు రాశారు. ఫైల్స్​ను మూడు కేటగిరీలుగా విభజించారు. 1947 నుంచి 1996 వరకు ఎ కేటగిరిలో చేర్చారు. ఇక బి కేటగిరిలో పదేళ్లపాటు, సి కేటగిరిలో 3 సంవత్సరాల పైల్స్ చేర్చారు. ఇలాంటి వాటిల్లో దాచాల్సిన అవసరం ఉన్న ఫైల్స్ వేరు చేయనున్నారు .

Etela Rajendar: పిచ్చి పట్టిందా హరీశ్ ?.. దానితో నాకేం సంబంధం.. మండిపడ్డ ఈటల రాజేందర్

Revanth Reddy ముందస్తు వ్యూహం.. KCR ప్లాన్‌కు కౌంటర్.. Congress హైకమాండ్ ఓకే చెబుతుందా ?

ఈ ఫైల్స్ కూడా...
రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి 1201 పైల్స్ అందగా, వాటిలో 700 ఫైల్స్ కు స్పందించారు. అలాగే కేంద్ర మంత్రులు రిఫరెన్స్ ఫైల్స్ 784లో 606 క్లియర్ చేశారు.మొత్తం 18.46 లక్షల ఫైల్స్ సమీక్షకు రాగా, అందులో 14.7 లక్షలు సమీక్షించారు. మరో 931442 దస్త్రాలు తొలగించారు. ఇక ఈ ఫైల్స్ 27లక్షలు రాగా అందులో 2.5 లక్షల జంక్ ఫైల్స్ గా గుర్తించినట్టు ఓ సీనియర్ అధికారి న్యూస్ 18కు వివరించారు.
Published by:Kishore Akkaladevi
First published: