CENTRE MAY EXTEND EMI EXEMPTION UPTO ONE YEAR FOR UJWALA SCHEME LPG CUSTOMERS SK
ఉజ్వల యోజన గ్యాస్ వినియోగదారులకు గుడ్న్యూస్..?
ప్రతీకాత్మక చిత్రం
2020 జూలైలో ముగియనున్న ఈఎంఐ డెఫర్మెంట్ స్కీమ్ గడువును మరో ఏడాది పాటు పొడిగించాలని యోచిస్తున్నాయి. దీని ప్రకారం వచ్చే ఏడాది కాలం పాటు ఉజ్వల స్కీమ్ కస్టమర్లు ఈఎంఐ డబ్బులను చెల్లించాల్సిన పని లేదు.
ఉజ్వల యోజన కింద ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ తీసుకున్న వారికి ఆయిల్ కంపెనీలు గుడ్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. 2020 జూలైలో ముగియనున్న ఈఎంఐ డెఫర్మెంట్ స్కీమ్ గడువును మరో ఏడాది పాటు పొడిగించాలని యోచిస్తున్నాయి. దీని ప్రకారం వచ్చే ఏడాది కాలం పాటు ఉజ్వల స్కీమ్ కస్టమర్లు ఈఎంఐ డబ్బులను చెల్లించాల్సిన పని లేదు. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న వారికి కేంద్రం ఉజ్వల యోజన కింద కేంద్రం ఉచితంగా సిలిండర్లు అందిస్తున్న విషయం తెలిసిందే. వీరికి గ్యాస్ స్టవ్, రెగ్యులేటర్, తొలి గ్యాస్ సిలిండర్ను ఇచ్చేందుకు రూ.3200 ఖర్చవుతాయి.ఇందులో రూ.1600లను కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన రూ.1600లను ఉజ్వల లబ్ధిదారులు ఆయిల్ కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది.
ఐతే ఆయిల్ కంపెనీలకు చెల్లించాల్సిన రూ.1600ను ఈఎంఐ రూపంలో కట్టొచ్చు. అది కూడా నేరుగా చెల్లించాల్సిన అవసరం లేదు. గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేస్తే వచ్చే సబ్సిడీ మొత్తం నుంచే ఆయిల్ కంపెనీలు ఈఎంఐని కట్ చేసుకుంటాయి. అంతేకాదు మొదటి 6 సిలిండర్ల బుకింగ్(14 కేజీలైతే) వరకు ఈఎంఐ కట్ చేసుకోకూడదు. 7వ సిలిండర్ బుకింగ్ నుంచి ఆయిల్ కంపెనీలు ఈఎంఐ డబ్బులను కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే 5 కేజీల సిలిండర్ అయితే.. 18వ సిలిండర్ బుకింగ్ నుంచి ఈఎంఐ డబ్బులు కట్టాలి. కాగా, ప్రస్తుత కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈఎంఐ డెఫర్మెంట్ స్కీమ్ గడువును మరో ఏడాది పాటు పొడిగించనున్నట్లు సమాచారం.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.