అయోధ్య రామమందిర ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు

ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. వచ్చే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో అయోధ్య ట్రస్టు బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

news18-telugu
Updated: November 13, 2019, 8:49 PM IST
అయోధ్య రామమందిర ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు
అయోధ్య రామమందిరం నమూనా (Image: Reuters)
  • Share this:
దశాబ్దాల కాలం నాటి అయోధ్య జన్మభూమి వివాదంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. వివాదాస్పద భూమి రామ్‌లల్లాకే చెందుతుందని..స్పష్టం చేయడంతో రామ మందిరం నిర్మాణానికి వడివడిగా అడుగులు వేస్తోంది కేంద్రం. మూడు నెలల్లోగా రామ జన్మభూమి ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా ప్రయత్నాలను వేగవంతం చేసింది. ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. వచ్చే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో అయోధ్య ట్రస్టు బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతాయి.


అయోధ్య కేసులో నవంబరు 9న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమి రామజన్మభూమి న్యాస్‌కే చెందుతుందని వెల్లడించింది. రామ మందిర నిర్మాణం కోసం మూడు నెలల్లో అయోధ్య ట్రస్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. మసీదుకు అయోధ్యలోనే 5 ఎకరాల ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలని సూచించింది కోర్టు. సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ నేత్రుత్వంలోని జస్టిస్ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ ఏకగ్రీవ తీర్పును వెల్లడించింది.
Published by: Shiva Kumar Addula
First published: November 13, 2019, 8:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading