హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ట్విట్టర్‌కు కేంద్రం నోటీసులు, లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరిక

ట్విట్టర్‌కు కేంద్రం నోటీసులు, లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరిక

ఐటీ శాఖ మంత్రిగానూ బాధ్యతలు తీసుకున్న అశ్వినీ వైష్ణవ్ కేంద్రం ఆదేశాలను పట్టించుకోని ట్విట్టర్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడ కార్యకలాపాలు సాగిస్తే అక్కడి చట్టాలను గౌరవించాల్సిందే అని స్పష్టం చేశారు.

ఐటీ శాఖ మంత్రిగానూ బాధ్యతలు తీసుకున్న అశ్వినీ వైష్ణవ్ కేంద్రం ఆదేశాలను పట్టించుకోని ట్విట్టర్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడ కార్యకలాపాలు సాగిస్తే అక్కడి చట్టాలను గౌరవించాల్సిందే అని స్పష్టం చేశారు.

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్ సైట్ ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

  ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్ సైట్ ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాక్‌లో ఉన్న లేహ్ ప్రాంతాన్ని జమ్మూకాశ్మీర్‌లో భాగంగా చూపించడాన్ని తప్పుపట్టింది. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ నవంబర్ 9న ట్విట్టర్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్‌కు నోటీసులు పంపింది. ‘ట్విట్టర్ చర్య భారత పార్లమెంట్‌ను అపహాస్యం చేసేలా ఉందని అభిప్రాయపడింది.’ లేహ్‌ను హెడ్ క్వార్టర్‌గా పేర్కొంటూ లద్దాక్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసింది భారత పార్లమెంట్. ఐదు పనిదినాల్లో దీనిపై సమాధానం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. భారత మ్యాప్‌ను తప్పుగా చూపించినందుకు, దేశ సార్వభౌమత్వాన్ని అగౌరవపరిచినందుు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. గత ఏడాది భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా జమ్మూకాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఒకటి జమ్మూకాశ్మీర్, రెండోది లద్దాక్.

  భారత మ్యాప్‌ను ట్విట్టర్‌లో తప్పుగా చూపించడం ఇది రెండోసారి. ఈ ఏడాది మొదట్లో కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాక్ హెడ్ క్వార్టర్ అయిన లేహ్‌ను చైనాలో భాగంగా చూపించినందుకు ఐటీ శాఖ నోటీసులు పంపింది. దీంతో ట్విట్టర్ ఆ పొరపాటును సరిదిద్దుకుంది. కానీ, ఇప్పుడు మళ్లీ జమ్మూకాశ్మీర్‌లో భాగంగా చూపిస్తూ మరో తప్పు చేసింది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Jammu and Kashmir, Ladakh, Twitter

  ఉత్తమ కథలు