హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Tomato Flu: వణికిస్తున్న టోమాటో ఫ్లూ.. చిన్నపిల్లల తలిదండ్రులూ.. జాగ్రత్త.. లక్షణాలు ఇవే

Tomato Flu: వణికిస్తున్న టోమాటో ఫ్లూ.. చిన్నపిల్లల తలిదండ్రులూ.. జాగ్రత్త.. లక్షణాలు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tomato Flu: ఇతర వైరల్ ఫీవర్ల తరహాలోనే టోమాటో ఫ్లూ లక్షణాలు ఉంటాయని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసటతో పాటు చర్మంపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. పిల్లలలో శరీరంపై ఎర్రటి బొబ్బలు క్రమంగా పెరగడం వల్ల.. అవి టమోటా ఆకారంలో కనిపిస్తాయి

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  కరోనా మహమ్మారి (Covid-19 Pandemic) నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ కొత్త కొత్త రోగాలు మళ్లీ వణికిస్తున్నాయి. మనదేశంలో టొమాటో ఫ్లూ (Tomato Flu) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టొమాటో ఫ్లూకి సంబంధించి కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. మనదేశంలో మొదట కేరళ (Kerala)లోని కొల్లాం జిల్లాలో టోమాటో ఫ్లూ వచ్చింది. మే 26న తొలి కేసు నమోదవగా.. జులై 26నాటికి  బాధితుల సంఖ్య 82కి పెరిగింది. కేరళతో పాటు తమిళనాడు, ఒడిశా, హర్యానాలోనూ టొమాటో ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి.  ఇతర వైరల్ ఫీవర్ల తరహాలోనే టోమాటో ఫ్లూ లక్షణాలు ఉంటాయని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) తెలిపింది. జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసటతో పాటు చర్మంపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. పిల్లలలో శరీరంపై ఎర్రటి బొబ్బలు క్రమంగా పెరగడం వల్ల.. అవి టమోటా ఆకారంలో కనిపిస్తాయి. అందుకే ఈ వ్యాధిని టొమాటో ఫ్లూగా పిలుస్తారు. టొమాటో ఫ్లూకి కరోనా వైరస్, మంకీపాక్స్, డెంగ్యూ, చికెన్ పాక్స్‌లతో సంబంధం లేదని స్పష్టం చేసింది. పాఠశాలకు వెళ్లే ఒకటి నుంచి పదేళ్ల వయసున్న చిన్నారుల్లో  ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తోంది. చేతులు, కాళ్లు, నోటిపై దద్దుర్లు వస్తున్నందున దీనిని హ్యాడ్ ఫూట్ మౌత్ డిసీస్ (HFMD) అని కూడా అంటున్నారు. న్యాప్‌కిన్స్ ఎక్కువగా వాడడం, అపరిశుభ్రమైన గోడలు, నేలను తాకడం, చేతి వేళ్లను నోటిలోపెట్టుకోవడం వల్ల వ్యాధి సంక్రమించే అవకాశముందని కేంద్రం తెలిపింది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న పెద్దలకూ టమోటా ఫ్లూ వచ్చే అవకాశముందని పేర్కొంది. ఐతే దీని గురించి ఆందోళణ చెందాల్సిన అవసరం లేదని.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే. వ్యాధి నుంచి బయటపడవచ్చని వెల్లడించింది.


  .


  వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం వల్ల టొమాటో ఫ్లూ నుంచి బయటపడవచ్చని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఎవరికైనా ఈ వ్యాధి వచ్చినట్లయితే.. బాధితుడిని 5 నుంచి 7 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలి. రోగి పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. ద్రవ ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. గోరువెచ్చని నీటితో మెత్తటి వస్త్రాన్ని ముంచి.. చర్మంపై అదమడం వల్ల చికాకు తగ్గుతుంది. పిల్లలు వీలైనంత వరకు చేతి రుమాలు వాడేలా ప్రోత్సహించాలని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ శరీరంపై బొబ్బలు ఉంటే వాటిని చేతితో గీకవద్దు. పిల్లలకు ఉతికిన బట్టలనే వేయాలి. డెటాల్ వంటి వాటితో ముంచి ఆరవేస్తే ఇంకా మంచిది. పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వండి. గొంతు నుంచి శాంపిల్‌ను తీసుకుని లేబొరేటరీకి పంపడం ద్వారా రోగికి టొమాటో ప్లూ ఉందో లేదో తెలుసుకోవచ్చు. టొమాటో ఫ్లూ నిర్ధారణ అయితే డాక్టర్‌ని సంప్రదించి.. మందులు తీసుకోవాలి. వారు చెప్పే సూచనలను పాటించాలి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Coronavirus, Tomato Flu

  ఉత్తమ కథలు