CENTRE ISSUES GUIDELINES FOR REOPENING OF SCHOOLS FROM OCT 15 CHECK DETAILS HERE SK
Schools Reopen: అక్టోబరు 15 నుంచి స్కూల్స్ ఓపెన్.. మార్గదర్శకాల విడుదల
ప్రతీకాత్మక చిత్రం
ష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాఠశాలల ప్రారంభంపై అక్కడి ప్రభుత్వాలదే తుది నిర్ణయమని తెలిపింది. ఆరోగ్యం, పరిశుభ్రత, భౌతిక దూరం ప్రామాణాలు తప్పని సరి చేస్తూ పాఠశాలలను ప్రారంభించాలని వెల్లడిచింది.
కరోనా కారణంగా ఏడు నెలలుగా స్కూళ్లు మూతపడ్డాయి. పదో తరగతికి పరీక్షలు నిర్వహించకుండానే పాస్ చేశారు. పలు పరీక్షలు కూడా పడ్డాయి. ఐతే అన్‌లాక్ 5 దశలో లాక్డౌన్ నుంచి మరిన్ని సడలింపులు వచ్చాయి. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబరు 15 నుంచి పాఠశాలలను ప్రారంభించుకోవచ్చని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో హోంశాఖ ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాఠశాలల ప్రారంభంపై అక్కడి ప్రభుత్వాలదే తుది నిర్ణయమని తెలిపింది. ఆరోగ్యం, పరిశుభ్రత, భౌతిక దూరం ప్రామాణాలు తప్పని సరి చేస్తూ పాఠశాలలను ప్రారంభించాలని వెల్లడిచింది. అన్ని పాఠశాలల్లో కేంద్ర ఆరోగ్యశాఖ విధివిధానాలను పాటించాలని కేంద్రం పేర్కొంది.
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) October 5, 2020
కేంద్రం మార్గదర్శకాలు:
కరోనా కట్టడికి సంబంధించి వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన SOPని అన్ని స్కూళ్లు పాటించాలి.
స్కూళ్లలో విద్యార్థులందరూ మాస్క్‌లు ధరించాలి. ఒకరికి మరొకరు కనీసం 6 అడుగుల దూరంలో ఉండాలి.
తరగతి గదులు, ప్రయోగశాలలు, ఆట స్థలాలను ఎప్పటికప్పుడు శానిటైజర్ చేయాలి. పరిశుభ్రత పాటించాలి.
పాఠశాల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద ఖచ్చితంగా శానిటైజర్‌ను అందుబాటులో ఉంచాలి.
తల్లిదండ్రుల రాతపూర్వక సమ్మతి ఉంటేనే విద్యార్థులను తరగతి గదులకు అనుమతించాలి.
ఖచ్చితంగా పాఠశాలకు హాజరు కావాలన్న నిబంధన ఏమీ లేదు. ఈ విషయంలో విద్యార్థులకు వెసులుబాటు ఉంటుంది.
విద్యార్థులు స్కూల్‌కు రాకుండా ఆన్లైన్ ద్వారానే క్లాసులు వినాలనుకుంటే అందుకు పాఠశాలల యాజమాన్యం అనుమతించాలి.
స్కూళ్లలో మధ్యాహ్న భోజన విషయంలో పరిశుభ్రత పాటించాలి. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.
స్కూళ్లు తెరిచిన రెండు మూడు వారాల వరకు ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై పాఠశాల యాజమాన్యాలు ఒత్తిడి చేయకూడదు.
అవసరమైతే NCERT ప్రత్యామ్నాయ విద్యా సంవత్సరాన్ని అనుసరించవచ్చు.
కాగా, ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 74,442 కరోనా పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 66,23,815కి చేరింది. ఐతే... కేసుల సంఖ్య తగ్గడానికి కారణం తక్కువ టెస్టులు జరగడమేనని తెలుస్తోంది. ఇండియాలో నిన్న 903 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,02,685కి చేరింది. దేశం,లో మరణాల రేటు ప్రస్తుతం 1.6 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో అది 2.94 శాతంగా ఉంది.
ఇండియాలో నిన్న 76,737 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 55,86,703కి పెరిగింది. దేశంలో రికవరీ రేటు 84.3 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 9,34,427 ఉన్నాయి. ఇండియాలో నిన్న 9,89,860 టెస్టులు జరిగాయి. మొన్నటి కంటే ఇవి 152271 తక్కువ జరిగాయి. మొత్తం టెస్టుల సంఖ్య 7కోట్ల 99 లక్షల 82వేల 394కి చేరింది
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.