విమానం, రైలు, ఇతర రాష్ట్రాల బస్సు ప్రయాణికులకు కొత్త రూల్స్...

విమానం, రైళ్లు, ఇతర రాష్ట్రాలకు బస్సుల్లో ప్రయాణించే వారి కోసం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది

news18-telugu
Updated: May 24, 2020, 3:31 PM IST
విమానం, రైలు, ఇతర రాష్ట్రాల బస్సు ప్రయాణికులకు కొత్త రూల్స్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విమాన, రైలు, ఇతర రాష్ట్రాలకు బస్సులో ప్రయాణించే వారి కోసం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ఈ నిబంధనలను ప్రవేశపెట్టింది. ప్రయాణికులకు టికెట్‌తో పాటు పాటించాల్సిన మార్గదర్శకాలను కూడా టికెట్‌కు అనుబంధంగా అందజేస్తారని కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.

1. ప్రయాణికులు అందరూ తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్‌ను వినియోగించాలి.

2. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో కోవిడ్ 19 నియంత్రణ పద్ధతులను పాటించాలి
3. ప్రయాణికులకు విమానం / రైలు / బస్సు ఎక్కే ముందు తప్పనిసరిగా ధర్మల్ స్క్రీనింగ్ చేయాలి. కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతించాలి.
4. విమానం / రైలు / బస్సు ఎక్కేటప్పుడు ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. శుభ్రత పాటించాలి.
5. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లలో తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలి.
6. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ ఉండాలి. సబ్బులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.7. ప్రయాణికులు దిగే సమయంలో కూడా థర్మల్ స్క్రీనింగ్ చేయాలి.
8. కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే అనుమతి ఇవ్వాలి. అలాగే తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలి. వారికి ఒకవేళ కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి.
9. కరోనా లక్షణాలు సోకిన వారిని ఐసోలేషన్‌కు తరలించాలి.
10. అత్యంత ఎక్కువ లక్షణాలు ఉన్న వారిని వెంటనే ప్రత్యేక కోవిడ్ 19 ఆస్పత్రికి తరలించాలి.
11. తక్కువ స్థాయిలో కరోనా లక్షణాలు ఉన్న వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచాలి. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం టెస్టులు నిర్వహించాలి.
First published: May 24, 2020, 3:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading