Home /News /national /

CENTRE HIKES MINIMUM SUPPORT PRICE FOR 17 CROPS LIKE SUNFLOWER SOYABEN AK

Crops MSP Hike: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 17 పంటల మద్దతు ధర పెంపు.. ఎంత పెంచారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Crops MSP Hike: అనేక వాణిజ్య పంటలకు సంబంధించిన మద్దతు ధర పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

    కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 17 పంటలకు కనీస మద్దతు(Minimum Support Price) ధర పెంచింది. కందులపై రూ. 300, పెసర్లపై రూ. 480, పొద్దుతిరుగుడుపై రూ. 385, సోయాబీన్‌పై రూ. 300, నువ్వులపై రూ. 523 పెంచింది. వీటితో పాటు సాధారణ వరి, ఏ గ్రేడ్ వరి, జోవర్, బజ్రా, రాగి, మొక్కజొన్న, మూంగ్, ఉరాడ్, వేరుశెనగ, రాంతిల్ పత్తి ,లాంగ్ ఫైబర్ పత్తి‌పై కూడా కనీస మద్దతు ధరను పెంచింది. 17 ఖరీఫ్ పంటలకు(Khariff Crops) ఎంఎస్‌పీ ఆమోదం లభించిందని సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఖరీఫ్ వ్యవసాయ ఆదాయం వరుసగా రెండో ఏడాది కూడా బలమైన వృద్ధిని కనబరుస్తుందని అంచనా వేయగా, అంతర్జాతీయ ఎరువులు(Fertilizers) మరియు దాణా ధరలు పెరగడంతో ఖరీఫ్ వ్యవసాయ ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉందని విదేశీ బ్రోకరేజ్ నివేదిక ముందుగా తెలిపింది.

    2022 నైరుతి రుతుపవనాలు దీర్ఘకాలిక సగటులో 99 శాతం సాధారణ స్థాయిలో ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గత మూడు సంవత్సరాలలో సాధారణ నుండి మంచి రుతుపవనాలు ఖరీఫ్ ఆహార ధాన్యాల(Food Grains) ఉత్పత్తికి సహాయపడిందిజ సగటున 2.8% పెరిగింది మరియు దీని ఫలితంగా ఖరీఫ్ ఉత్పత్తి 2.5% పెరగవచ్చని.. రబీలో ఉత్పత్తిలో 1.5% పెరుగుదల ఉండొచ్చని అంచనా వేసింది.



    గత నెలలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల లభ్యత అంచనా వేసిన డిమాండ్ కంటే ఎక్కువగా ఉందని ప్రభుత్వం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి దాని సబ్సిడీ సుమారు రూ. 2.5 లక్షల కోట్లకు పెరగవచ్చని పేర్కొంది. పంట పోషకాల నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎరువుల తరలింపును పర్యవేక్షించాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా రైతులకు ఖచ్చితమైన సమాచారం అందించాలని రాష్ట్రాలకు సూచించింది.

    కరోనాతో అనాథలైన చిన్నారులు..లోన్ కట్టాలంటూ LIC నోటీసులు..చివరికి

    Kerala Gold Smuggling Case : గోల్డ్ స్మగ్లింగ్ లో సీఎం విజయన్ హస్తం..రాజీనామాకు డిమాండ్..సీఎంకి భారీ భద్రత!

    గత 8 సంవత్సరాలలో విత్తనాల మార్కెట్ విధానం లాభపడిందని... రైతుల ఆదాయాన్ని పెంచేందుకు అనేక చర్యలు తీసుకున్నామని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద 2 లక్షల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరాయని అన్నారు. ఎరువులపై 2 లక్షల 10 వేల కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చామని అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Centre government, Crops, MSP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు