దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అరుదైన అవకాశమిచ్చింది. 50 లక్షల రూపాయలను గెలుచుకునే సదుపాయాన్ని కల్పించింది. ఐసీటీ గ్రాండ్ ఛాలెంజ్ లో పాల్గొనేవారు ఈ ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చు. ఛాలెంజ్ ఏంటంటే ఏవరైతే సృజనాత్మక, ఖర్చుతో కూడిన నీటి సరఫరా ప్రమాణాలు, పర్యవేక్షణ వ్వవస్థ(స్మార్ట్ వాటర్ సప్లై మెజర్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టం)ను అభివృద్ధి చేయాలి. ఈ వ్యవస్థలను గ్రామాల్లో పొందుపరుస్తారు.
జళ్ జీవన్ మిషన్ (జేజేఎం).. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వార్యంలో ఈ ఛాలెంజ్ ను ప్రారంభించింది. భారతీయ స్టార్ట అప్స్, చిన్న, మధ్య, సూక్ష్మ తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ), ఇతర దేశీయ కంపెనీలు ఈ స్టార్ట్ వాటర్ సప్లే మెజర్మెంట్ వ్యవస్థ డిజైనింగ్ లో పాల్గొనవచ్చు.
రివార్డులు ఎంతంతంటే..
వ్యక్తిగతంగా లేదా జట్టుగా ఈ ఐసీటీ గ్రాండ్ ఛాలెంజ్ లో పాల్గొనవచ్చు. ప్రథమ స్థానంలో నిలిచిన వారికి రూ.50 లక్షలు, రెండో స్థానంలో ఉన్నవారికి రూ.20 లక్షలు అందజేస్తారు. ఈ పనిని పూర్తిచేయడానికి ప్రముఖ ఇంక్యూబేటర్ మీటీ నుంచి సక్కెస్ ఫుల్ డెవలపర్లు కూడా అవకాశాన్ని అందున్నారు. అంతేకాకుండా ఈ క్యాంపైన్ ను ప్రధాని నరేంద్ర మోదీ స్వప్నమైన భారతదేశ స్వావలంభన(సెల్ఫ్ రిలైంట్ ఇండియా), డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియాలో భాగంగా ప్రమోట్ చేయనున్నారు.
ఈ ఐసీటీ గ్రాండ్ ఛాలెంజ్ కు సంబంధించిన పూర్తి వివరాలు https://jjm.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించి తెలుసుకోవచ్చు.
మొదట 100 గ్రామాల్లో..
2024 నాటికి దేశంలో ప్రతి గ్రామీణ ప్రాంతంలోని ప్రతి ఇంటికి నీటి పంపు సౌలభ్యం(ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్-ఏఫ్ హెచ్ టీసీ) ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జేజేఎం (ప్రతి ఇంటికి నీరు) కింద ఈ పథకం పనిచేస్తుంది. ఈ పథకం కింద గ్రామాల్లోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తారు. పథకాన్ని పర్యవేక్షించడానికి, మెరుగైన నాణ్యమైన సేవలను అందించడానికి స్వయంచాలక డేటా సేకరణ, విశ్లేషణ చేస్తారు. నీటి సరఫరా వ్యవస్థను డిజిటైజ్ చేయడం వల్ల అనేక సమస్యలు పూర్తిగా తొలుగుతాయి. జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్ ను ఆరంభంలో దేశవ్యాప్తంగా 100 గ్రామాల్లో ప్రారంభిస్తారు. దీని విజయాలను బట్టి ఇతర గ్రామాల్లోనూ అమలు చేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.