Home /News /national /

CENTRE DEPOSITED SECOND INSTALLMENT AMOUNT OF RS 500 IN WOMEN JAN DHAN YOJANA ACCOUNTS AK

మహిళలకు శుభవార్త... నేటి నుంచి జన్ ‌ధన్ ఖాతాల్లో డబ్బు విత్ డ్రా....

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

లాక్‌డౌన్ సందర్భంగా మూడు నెలల పాటు జన్ ధన్ యోజన అకౌంట్లు ఉన్న మహిళలకు మూడు నెలల పాటు నెలకు రూ. 500 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

    జన్ ధన్ ఖాతాల్లో రెండో విడతకు సంబంధించిన డబ్బును కేంద్రం జమ చేసింది. లాక్‌డౌన్ సందర్భంగా మూడు నెలల పాటు జన్ ధన్ యోజన అకౌంట్లు ఉన్న మహిళలకు మూడు నెలల పాటు నెలకు రూ. 500 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్‌లో తొలి విడతగా వారి ఖాతాల్లో రూ. 500 జమ చేసింది. తాజాగా రెండో విడతకు సంబంధించిన డబ్బును వారి ఖాతాల్లో జమ చేసింది. ఒక్కో అకౌంట్‌లో రూ. 500 జమచేసింది. అయితే ఈ డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు కేంద్రం కొన్ని నిబంధనలు విధించింది.

    అకౌంట్ నంబర్ చివర్లో 0, 1 ఉన్న ఖాతాదారులు సోమవారం తమ సొమ్మును తీసుకోవాలన్న కేంద్రం... ఖాతా చివర్లో 2,3 అంకెలు ఉన్న వాళ్లు మే 5వ తేదీన తీసుకోవాలని సూచించింది. అకౌంట్ చివర్లో 4,5 ఉన్నవాళ్లు మే 6న డబ్బులు తీసుకోవాలని, ఖాతా చివర్లో 6,7 నెంబర్లు ఉన్నవాళ్లు మే 8న డబ్బులు విత్ డ్రా చేసుకోవాలి. ఇక ఖాతా చివర్లో 8,9 ఉన్న వాళ్లు మే 11న తమ సొమ్మును తీసుకోవాలి. ఇక మే 11 తరువాత ఎవరైనా ఎక్కడైనా తమ డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. బ్యాంకుల దగ్గర రద్దీని నియంత్రించేందుకు కేంద్రం ఈ నిబంధనలు తీసుకొచ్చింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద కేంద్రం జన్ ధన్ ఖాతాలు ఉన్న మహిళలకు ఈ మేరకు ఆర్థిక సాయం చేస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Coronavirus, Pradhan Mantri Jan Dhan Yojana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు