ఉల్లి ధరలు తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం

ఈ సంవత్సరం ఉల్లి దిగుబడి తగ్గడంతో కిలో ఉల్లిపాయల ధర రూ. 80 వరకూ పలుకుతుండడంతో, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

news18-telugu
Updated: October 9, 2019, 11:24 AM IST
ఉల్లి ధరలు తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొద్దిరోజులుగా పెరిగిపోతున్న ఉల్లి ధరలు సామాన్యుడి బడ్జెట్‌కు భారంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఉల్లి ధరలు తగ్గించేందుకు కేంద్రం కూడా తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ధరలు అదుపులోకి వచ్చేంతవరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం కూడా విధించింది. అయితే తాము తీసుకుంటున్న చర్యలు అంతగా ఫలితాలు ఇవ్వకపోవడం... ధరలు తగ్గించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఈ నెలాఖరులోగా 2 వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఎంఎంటీసీ ద్వారా టెండర్లను కూడా ఆహ్వానించింది.

ఈ సంవత్సరం ఉల్లి దిగుబడి తగ్గడంతో కిలో ఉల్లిపాయల ధర రూ. 80 వరకూ పలుకుతుండడంతో, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పండగల సీజన్ కావడం, పైగా మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెలాఖరులో జరుగనున్న నేపథ్యంలో, ప్రజా వ్యతిరేకతను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఉల్లి పంట ఎక్కువగా పండే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భారీ వరదలు రావడంతో దిగుమతి ఒక్కసారిగా తగ్గిపోవడంతో ధరలు పెరిగిపోయాయి.


First published: October 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు