CENTRE CUTS EXCISE DUTY ON PETROL AND DIESEL BY RS 8 AND RS 6 PER LITRE PVN
Oil Prices : భారీగా తగ్గిన పెట్రోల్,డీజిల్ ధరలు..లీటర్ పై రూ.9 తగ్గింపు
ప్రతీకాత్మక చిత్రం
Oil Prices : కేంద్ర ప్రభుత్వం శనివారం, మే 21, పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Oil Prices : దేశ ప్రజలకు శుభవార్త తెలిపింది కేంద్ర ప్రభుత్వం. కొద్ది రోజులుగా భారీగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ఉపశమనం కలిగించేలా పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం(Central Excise Duty)తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం శనివారం(మే 21) పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ సుంకాన్ని తగ్గించడం ద్వారా వాహనదారులకు భారీ ఊరట లభించింది. దీంతో లీటరు పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గుతుందని ఆమె తెలిపారు. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి ప్రతిఏటా దాదాపు రూ.1 లక్ష కోట్ల వరకు ఆదాయం తగ్గిపోనుంది.
ఇక, తగ్గిన ఎక్సైజ్ సుంకం రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. కొంత కాలంగా భారీగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలతో తీవ్రంగా ఇబ్బంది పడిన వాహనదారులు తాజాగా కేంద్రం తగ్గించిన ధరలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.