Home /News /national /

CENTRE CLARIFIES ON COVID 19 OMICRON VARIANT CASES IN INDIA HERE IS THE DETAILS AK

OMICRON: ‘ఒమిక్రాన్‌’పై కేంద్ర ఆరోగ్యమంత్రి కీలక ప్రకటన.. అప్రమత్తమైన రాష్ట్రాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

OMICRON: ఇటీవల దక్షిణాఫ్రికా తిరిగి వచ్చిన ఇద్దరిలో ఒకరి నమూనా డెల్టా వేరియంట్‌కు భిన్నంగా ఉందని.. అయితే అది ఒమిక్రాన్ అని కచ్చితంగా చెప్పలేమని కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ కె సుధాకర్ తెలిపారు.

    భారతదేశంలో కొత్త కోవిడ్-19 వేరియంట్ ఓమిక్రాన్‌పై ఆందోళనలు పెరుగుతున్నాయి. వివిధ దేశాల్లో వెలుగు చూస్తున్న ఈ కొత్త కరోనా వేరియంట్‌కు సంబంధించి భారత్‌లో ఒక్క కేసు కూడా వెలుగు చూడకపోయినప్పటికీ.. విదేశాల నుంచి వస్తున్న వారికి కరోనా టెస్టులు నిర్వహిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవియా ఈ రోజు రాజ్యసభలో దీనిపై వివరణ ఇచ్చారు. దేశంలో ఇప్పటివరకు ఓమిక్రాన్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశామని.. పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

    మరోవైపు పలు రాష్ట్రాలపై ఒమిక్రాన్ వేరియంట్‌ ప్రభావం పడింది. ఈ కొత్త వేరియంట్ భయాల కారణంగా విద్యార్థుల కోసం పాఠశాల పునఃప్రారంభ తేదీని పొడిగిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది. ముంబైలోని 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు ఉన్న పాఠశాలలు ఇప్పుడు డిసెంబర్ 15, 2021న తెరవాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుముందు తేదీని డిసెంబర్ 1గా నిర్ణయించారు. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, ఇతర నగరాల్లో, పాఠశాలలు రేపటి నుండి తెరుచుకోనున్నాయి.

    ఇటీవల దక్షిణాఫ్రికా తిరిగి వచ్చిన ఇద్దరిలో ఒకరి నమూనా డెల్టా వేరియంట్‌కు భిన్నంగా ఉందని.. అయితే అది ఒమిక్రాన్ అని కచ్చితంగా చెప్పలేమని కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ కె సుధాకర్ తెలిపారు. తాము ఐసీఎంఆర్‌తో టచ్‌లో ఉన్నామని, ఈ శాంపిల్‌ను ఐసీఎంఆర్‌కు పంపినట్లు తెలిపారు.

    Salt: మీరు వాడే ఉప్పు మంచిదేనా ? ఇలా చెక్ చేసుకోండి.. చాలా ముఖ్యం

    Health Tips: మీరు ఈ రకమైన సమస్యతో బాధపడుతున్నారా ? వెంటనే ఈ కూరగాయలకు దూరంగా ఉండండి

    Telangana: ఢిల్లీ నుంచి వచ్చి సైలెంట్ అయిన KCR.. కొత్త ప్లాన్‌.. ఆ తరువాతే అమలు చేస్తారా ?

    KCRను మళ్లీ టెన్షన్ పెడుతున్న ఈటల రాజేందర్.. అజ్ఞాతంలోకి ఆ నాయకుడు ?

    తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించిన భయాందోళనలు అవసరం లేదని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు తెలిపారు. తెలంగాణలోకి ఒమిక్రాన్ వేరియంట్ ఎంటర్ కాలేదని వివరించారు. అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పరీక్షలు జరుపుతున్నామని.. ఈ అంశంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు.

    క‌రోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్ర‌పంచాన్ని ఒమిక్రాన్ వేరియంట్ క‌ల‌వ‌ర పెడుతోంది. ఇప్ప‌టికైతే ఎక్కువ కేసులు రాలేదు కానీ వేగంగా వ్యాప్తి చేందే ఈ వేరియంట్ ప్ర‌మాద‌కరంగా మారుతుంద‌ని వైద్యులు అంచ‌నా వేస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాప్రికాలో SARS CoV 2 కొత్త రూపాంతరం చెంది వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ఇది అత్యంత ఆందోళనకరమైన వేరియంట్ గా వర్గీకరించింది. దీనిపై ప్రపంచదేశాలు జాగ్రతగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)హెచ్చరించింది. అయితే దీనికి ‘ఓమిక్రాన్’ అనే పేరు పెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇక దీనిపై ముఖ్యమైన దేశాలు అప్రమత్తం అయ్యాయి. . ఇది B.1.1.529 అనే వంశానికి చెందిన సంబంధిత SARS CoV 2 వైరస్‌ల సమూహాన్ని గుర్తించింది. ఈ నేప‌థ్యంలో వైర‌స్ మ‌రింత వ్యాప్తి చెంద‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను తెలుసుకోండి.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Omicron corona variant

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు