Home /News /national /

CENTRE BRINGS ORDINANCE TO EXTEND TENURE OF ED AND CBI DIRECTORS UP TO 5 YEARS MKS

CBI, ED డైరెక్టర్ పదవులపై కేంద్రం అనూహ్య నిర్ణయం -ordinance జారీ -2నుంచి 5కు పెంపు

సీబీఐ, ఈడీపై కేంద్రం ఆర్డినెన్స్

సీబీఐ, ఈడీపై కేంద్రం ఆర్డినెన్స్

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అత్యంత శక్తిమంతమైన రెండు దర్యాప్తు సంస్థల భవితవ్యం మారిపోయింది. దశాబ్దాల సంప్రదాయాన్ని పక్కన పెడుతూ ఆ కీలక సంస్థలపై మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అత్యంత శక్తిమంతమైన రెండు దర్యాప్తు సంస్థల భవితవ్యం మారిపోయింది. దశాబ్దాల సంప్రదాయాన్ని పక్కన పెడుతూ ఆ కీలక సంస్థలపై మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్ల పదవీ కాలాన్ని ఐదేళ్లకు పెంచిన కేంద్రం.. ఈ మేరకు ఆదివారం నాడు హుటాహుటిన ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది. దీంతో సదరు నిర్ణయాలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లయింది..

సీబీఐ, ఈడీ డైరెక్టర్ల ప్రస్తుతం వీరి పదవీ కాలం రెండేళ్ళు మాత్రమే కాగా మోదీ సర్కారు నిర్ణయంతో ఇప్పుడదని 5ఏళ్లకు పెరగనుంది. నియామకం ప్రారంభంలో పేర్కొన్న పదవీ కాలం పూర్తయిన తర్వాత ఒకేసారి ఒక ఏడాది వరకు పొడిగించవచ్చునని, మొత్తం మీద ఐదేళ్ళ వరకు పొడిగించవచ్చునని ఈ ఆర్డినెన్సులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు సీబీఐ, ఈడీ డైరెక్టర్లను రెండేళ్ళ నిర్ణీత కాలానికి నియమిస్తున్నారు. ఈ రెండేళ్ల పదవీ కాలం ముగియక ముందు వీరిని తొలగించడం సాధ్యం కాదు. ఈ పదవీ కాలం ముగిసిన తర్వాత వీరి పదవీ కాలాన్ని పొడిగించవచ్చు.

తాజాగా విడుదల చేసిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (అమెండ్‌మెంట్) ఆర్డినెన్స్, 2021 ప్రకారం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ నియామకం ప్రారంభంలో నిర్ణయించిన పదవీ కాలం ముగిసిన తర్వాత క్లాజ్ (ఏ) ప్రకారం కమిటీ సిఫారసు చేసిన మీదట ప్రజా ప్రయోజనాల రీత్యా, లిఖితపూర్వకంగా రాయదగిన కారణం మేరకు ఒక ఏడాది వరకు పదవీ కాలాన్ని పొడిగించవచ్చు. నియామకం ప్రారంభంలో నిర్ణయించిన పదవీ కాలంతోపాటు పొడిగించిన పదవీ కాలంతో కలిపి మొత్తం మీద పదవీ కాలం ఐదేళ్ళకు మించరాదు.

ఇదే విధంగా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (అమెండ్‌మెంట్) ఆర్డినెన్స్, 2021ను కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ రెండు ఆర్డినెన్సులు తక్షణం అమల్లోకి వచ్చాయి. 1997కు పూర్వం సీబీఐ డైరెక్టర్ పదవీ కాలాన్ని నిర్దిష్టంగా పేర్కొనలేదు. ప్రభుత్వం ఏ విధంగానైనా సీబీఐ డైరెక్టర్‌ను తొలగించే అవకాశం ఉండేది. అయితే సుప్రీంకోర్టు వినీత్ నారాయణ్ కేసులో ఇచ్చిన తీర్పులో సీబీఐ డైరెక్టర్ పదవీ కాలం కనీసం రెండేళ్ళు ఉండాలని తెలిపింది. కాగా, కేంద్ర సంస్థల ద్వారా రాజకీయ ప్రత్యర్థులను లొగదీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణల నడుమ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ చర్చనీయాంశమైంది.
Published by:Madhu Kota
First published:

Tags: CBI, Enforcement Directorate, Pm modi, Union government

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు