హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Single-use plastic: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్.. కేంద్రం కీలక నిర్ణయం.. ఎప్పటినుంచంటే..

Single-use plastic: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్.. కేంద్రం కీలక నిర్ణయం.. ఎప్పటినుంచంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకసారి వాడి పారేసే(సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువులపై కేంద్రం నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకసారి వాడి పారేసే(సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువులపై కేంద్రం నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం 2022 జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పులు, స్ట్రాలు, ట్రేలపై నిషేధం అమలవుతుందని తెలిపింది. వీటి తయారీ, విక్రయం, వాడకంపై ఈ నిషేధం వర్తిస్తుందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన నిబంధనలను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. అలాగే ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడకంపై కొత్త ఆంక్షలను తీసుకొచ్చింది. సెప్టెంబర్‌ 30 నుంచి 75 మైక్రాన్ల ప్లాస్టిక్‌ కవర్లకే అనుమతి ఉంటుందని తెలిపింది. 2022 డిసెంబర్‌ 31 తర్వాత 120 మైక్రాన్ల ప్లాస్టిక్ కవర్లనే అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది.

పాలీస్టైరిన్‌తో సహా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ.. అమ్మకం, వినియోగంపై 2022 జూలై 1 నుంచి నిషేధం విధించనున్నట్టు పర్యావరణ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్లాస్టిక్ పుల్లలతో ఉండే ఇయర్‌బడ్స్, బెలూన్స్‌కు ఉండే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్, డెకరేషన్ కోసం ఉపయోగించే పాలీస్టైరీన్, ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్క్‌లు, చెమ్చాలు, కత్తులు, స్ట్రాలు, ట్రేల స్వీట్ బాక్స్‌ల ర్యాపింగ్, ఆహ్వాన పత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న పీవీసీ బ్యానర్లు... వంటి వాటిపై నిషేధం అమలవుతుంది.

ఇక, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సవరణ నియమాలు, 2021 ప్రకారం.. 2022 నాటికి తక్కువ వినియోగం, అధిక చెత్త సామర్ధ్యం కలిగిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తుందని సదరు మంత్రిత్వా శాఖ తెలియజేసింది. ఇక, 2018 జూన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. 2022 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించాల‌ని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌కు కేంద్ర ప్రభుత్వం కూడా స‌మ‌ర్థ‌వంత‌మైన చ‌ర్య‌లు తీసుకుంటుందని తెలిపారు.

First published:

Tags: Centre government, Plastic Ban

ఉత్తమ కథలు