Rajya Sabha Ruckus: రాజ్యసభ గందరగోళంపై వీడియో రిలీజ్.. విపక్షాలపై కేంద్రం సీరియస్

రాజ్యసభ (ఫైల్ ఫోటో)

Rajya Sabha: విపక్షాల కారణంగా ప్రజల సొమ్ము సొమ్ము వృధా అయ్యిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు.

  • Share this:
    ఇటీవల రాజ్యసభలో జరిగిన గందరగోళానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను రిలీజ్ చేశారు. సభలో ప్రభుత్వ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని విపక్షాలు అధికారపక్షాన్ని టార్గెట్ చేస్తున్నాయి. అయితే ఈ వీడియోలోని సన్నివేశాలు మాత్రం కాస్త భిన్నంగా ఉన్నాయి. విధుల్లో ఉన్న మార్షల్స్‌పైకి విపక్ష సభ్యులు దూసుకువెళ్లినట్లు ఆ వీడియోలో ఉన్నది. చైర్ వైపు దూసుకువస్తున్న ఎంపీలను మార్షల్స్ అడ్డుకున్నారు. ఇక ప్రతిపక్ష ఎంపీలు పేపర్లను చించేసి గాల్లోకి విసిరేసిన దృశ్యాలు కూడా ఆ సీసీటీవీలో కనిపిస్తున్నాయి. ఓ ఎంపీ టేబుల్ ఎక్కుతున్న దృశ్యాలు కూడా అందులో కనిపించాయి.

    ప్రభుత్వం రెండు రోజుల ముందే పార్లమెంట్‌ను రద్దు చేసిందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ వీడియోను రిలీజ్ చేశారు. మరోవైపు విపక్షాలపై ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. పార్లమెంట్ సమావేశాలను ముందుగా వాయిదా వేసిన ఘటనలో ప్రతిపక్షాలు క్షమాపణలు చెప్పాలని మంత్రులు డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో తమ సమస్యలను లేవనెత్తాలని ప్రజలు ఎదురు చూస్తారని, కానీ విపక్షాలు అరాచకాన్ని సృష్టించాయని ఆరోపించారు. వాళ్లు ప్రజల గురించి పట్టించుకోలేదని అన్నారు.

    విపక్షాల కారణంగా ప్రజల సొమ్ము సొమ్ము వృధా అయ్యిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. రాజ్యసభలో జరిగిన ఘటనను ఖండిస్తున్నామన్నారు. మొసలి కన్నీళ్లు ఆపేసి, విపక్షాలు దేశానికి క్షమాపణలు చెప్పాలని మంత్రి ఠాకూర్ తెలిపారు. రాజ్యసభలో విపక్షాల ప్రవర్తనా తీరు హేయంగా ఉన్నట్లు మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఫర్నీచర్‌, డోర్లను ధ్వంసం చేశారని, మంత్రుల చేతుల నుంచి పేపర్లు లాగేశారని, మార్షల్స్‌పై తిరగబడ్డారని, డెస్క్‌లు, చైర్లను ధ్వంసం చేశారని విమర్శించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: