హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Night curfew: ఒమిక్రాన్ వ్యాప్తిపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం.. అవసరమైతే నైట్ కర్ఫ్యూ విధించాలని సూచన

Night curfew: ఒమిక్రాన్ వ్యాప్తిపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం.. అవసరమైతే నైట్ కర్ఫ్యూ విధించాలని సూచన

లేదంటే... ఏదైనా సినిమా చూస్తారు. లేదా... ఏదైనా పరిశోధన చేస్తారు. ఇలా రాత్రిళ్లను ఫుల్లుగా వాడేసుకుంటారు. వీళ్ల దృష్టిలో నైట్ అంటే... వాడేసుకునే టైమ్. నిద్రపోయే టైమ్ కాదు.

లేదంటే... ఏదైనా సినిమా చూస్తారు. లేదా... ఏదైనా పరిశోధన చేస్తారు. ఇలా రాత్రిళ్లను ఫుల్లుగా వాడేసుకుంటారు. వీళ్ల దృష్టిలో నైట్ అంటే... వాడేసుకునే టైమ్. నిద్రపోయే టైమ్ కాదు.

కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అలర్ట్ చేస్తూ లేఖ రాసింది. ఒమిక్రాన్​ కట్టడి చేయడానికి అవసరమైతే ‘నైట్​ కర్ఫ్యూ’ పెట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్​ భూషణ్​ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు.

ఇంకా చదవండి ...

కరోనా సెకండ్​ వేవ్ తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (omicron) ప్రపంచదేశాలను కలవరపెడుతోంది.​ మొదట దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఈ వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచదేశాలకు పంజా విసురుతోంది.

ఇది డెల్టా కంటే వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్​ఓ సైతం హెచ్చరించింది. దీంతో, ఇప్పటికే అనేక దేశాలు ఆంక్షల బాట పట్టాయి. అయితే, భారత్​లో ఒమిక్రాన్​ (omicron) ఉధృతి ప్రస్తుతానికి తక్కువగానే ఉన్నప్పటికీ.. వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అలర్ట్ చేస్తూ లేఖ రాసింది. ఒమిక్రాన్​ కట్టడి చేయడానికి అవసరమైతే ‘నైట్​ కర్ఫ్యూ’ పెట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.

ఇది కూడా చదవండి: Omicron : భారత్‌లో విజృంభణ.. ఒమిక్రాన్ కేసులు@200.. టాప్-3గా Telangana.. నలుగురికి సీరియస్?

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్​ భూషణ్​ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. రానున్న క్రిస్మస్​, న్యూ ఇయర్​ వేడుకల్లో ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. జన సమూహాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, వివాహాలు, అంత్యక్రియలకు హాజరయ్యే వారి సంఖ్యను తగ్గించాలని కోరింది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలంతా ఫేస్​ మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. కరోనా పరీక్షలు, నిఘా పెంచడంతో పాటు అవసరమైతే రాత్రి పూట నైట్​ కర్ఫ్యూ విధించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.

ఇది కూడా చదవండి: Omicron : వ్యాక్సిన్ వేసుకోకుంటే చావు తప్పదా? -USలో తొలి ఒమిక్రాన్ మరణం -UKలో ఇప్పటికే 12 మంది మృతి

* డెల్టా కంటే మూడు రెట్ల వేగంతో ఒమిక్రాన్ వ్యాప్తి..

ఒమిక్రాన్​ కేసులు వెలుగుచూసిన ప్రాంతాలను కంటైన్​మెంట్​ జోన్లుగా ప్రకటించి వైరస్​ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు సూచించింది.

కోవిడ్​ పాజిటివ్​ క్లస్టర్లు, కంటైన్​మెంట్​ జోన్లు, బఫర్​ జోన్లు ఏర్పాటు చేయాలని కోరింది.సెకండ్​ వేవ్​కు కారణమైన డెల్టా కంటే ఒమిక్రాన్​ మూడు రెట్లు వేగంగా పెరిగే అవకాశం ఉన్నందున జీనోమ్​ సీక్వెన్సింగ్​ పరీక్షల కోసం కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించింది.

జిల్లాల్లో 10% పాజిటివిటీ రేటు నమోదైనా లేదా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఆక్యుపెన్సీ 40%కి పెరిగినా సరే తప్పనిసరిగా నైట్​ కర్ఫ్యూలు, కంటైన్‌మెంట్ జోన్లు ప్రకటించాలని తెలిపింది. వివాహాలు, అంత్యక్రియలకు హాజరయ్యే వారి సంఖ్యను తగ్గించాలని, కార్యాలయాలు, పరిశ్రమలు, ప్రజా రవాణాను పరిమితం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. మరోవైపు, కోవిడ్​ వ్యాక్సినేషన్​ను వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.

Published by:Sambasiva Reddy
First published:

Tags: Covid 19 restrictions, Lockdown, Night curfew, Omicron, Omicron corona variant

ఉత్తమ కథలు