రాష్ట్రాలకు కేంద్రం కీలక సలహా... ఆ చట్టం ప్రయోగించాలంటూ...

కొందరు వ్యాపారులు. తగిన సరఫరా లేదంటూ నిత్యావసర వస్తువుల ధరలను అమాంతం పెంచేస్తున్నారు.

news18-telugu
Updated: April 8, 2020, 5:33 PM IST
రాష్ట్రాలకు కేంద్రం కీలక సలహా... ఆ చట్టం ప్రయోగించాలంటూ...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
లాక్ డౌన్ సమయంలో నిత్యావసర వస్తువులకు సంబంధించి కృత్రిమ కొరత సృష్టించి ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బులు గుంజుతున్నారు కొందరు వ్యాపారులు. తగిన సరఫరా లేదంటూ ధరలను అమాంతం పెంచేస్తున్నారు. దీనిపై ఏం చేయాలనే దానిపై కేంద్రం రాష్ట్రాలకు కీలక సూచన చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా బుధవారం రాష్ట్ర ప్రభుత్వాల చీఫ్ సెక్రటరీలకు రాసిన లేఖలో నిత్యావసర వస్తువుల చట్టం, 1955 నిబంధనలను అమలు చేయాలని తెలిపారు. ఈ చట్టం ప్రకారం నేరాలు క్రిమినల్ స్వభావం కల నేరాలని, నేరస్థులను గరిష్ఠంగా ఏడేళ్ళ జైలు శిక్ష లేదా జరిమానా లేదా ఈ రెండు శిక్షలతో శిక్షించవచ్చునని తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్ నిరోధం, నిత్యావసర వస్తువుల సరఫరా నిర్వహణ చట్టం, 1980 ప్రకారం నేరస్థులను అరెస్టు చేసే విషయాన్ని కూడా పరిశీలించాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్రం కోరింది.

నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా, న్యాయమైన ధరలకు ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా అత్యవసర చర్యలు తీసుకోవాలని కోరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం నిత్యావసర వస్తువుల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ చేసేవారిపై వేగంగా, కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రజలు సైతం నిత్యావసరాల కోసం ప్రతిరోజు బయటకు రావొద్దని... వారానికి సరిపోయే సరుకులను ఒకేసారి కొనుగోలు చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు.
Published by: Kishore Akkaladevi
First published: April 8, 2020, 5:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading