కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..

ప్రతీకాత్మక చిత్రం

గ‌ృహ నిర్మాణాల వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆలోచిస్తున్నామని గత నెలలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా ఏడవ పే కమిషన్ సూచనల మేరకు హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్(HBA) నియమ నిబంధనలను సవరించారు.

  • Share this:
    ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ నుంచి బయటపడేందుకు ఇటీవలే కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించిన ప్రభుత్వం..ఇప్పుడు గృహ నిర్మాణ రంగంపై దృష్టి సారించింది. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందకు పలు రాయితీలుప్రకటిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఇచ్చే గృహ రుణాలపై వడ్డీ రేటును 8.5శాతం నుంచి 7.9శాతానికి తగ్గించినట్టు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖ నుంచి ప్రకటన విడుదలైంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది.

    గ‌ృహ నిర్మాణాల వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆలోచిస్తున్నామని గత నెలలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా ఏడవ పే కమిషన్ సూచనల మేరకు హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్(HBA) నియమ నిబంధనలను సవరించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్ల కొనుగోళ్లు లేదా నిర్మాణాలు చేపడితే గృహ నిర్మాణ రంగం మళ్లీ గాడిలో పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.ఈ నేపథ్యంలోనే దసరా కానుకగా ఉద్యోగులకు వడ్డీ రేట్లను తగ్గించి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
    First published: