#MissionPaani : మిషన్ పానీ క్యాంపెయిన్‌కు నితిన్ గడ్కరీ మద్దతు..

MissionPaani : నదుల్లో చేరుతున్న చాలా నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని.. దాన్ని ఒడిసిపట్టుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా మంచి పని చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే ఇంద్రావతి,అటు గోదావరి నదుల నీటిని ఒడిసిపడుతోందన్నారు.

news18-telugu
Updated: August 27, 2019, 4:27 PM IST
#MissionPaani : మిషన్ పానీ క్యాంపెయిన్‌కు నితిన్ గడ్కరీ మద్దతు..
మిషన్ పానీ క్యాంపెయిన్‌లో నితిన్ గడ్కరీ
  • Share this:
నెట్‌వర్క్18-హార్పిక్ సంయుక్తంగా చేపట్టిన మిషన్ పానీ క్యాంపెయిన్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ముంబైలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పాల్గొని మద్దతు తెలిపారు. మిషన్ పానీ క్యాంపెయిన్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. నీటి పరిరక్షణ కోసం ప్రభుత్వం తరుపున చేపడుతున్న కార్యక్రమాల గురించి తెలిపారు. చాలావరకు బస్సులను, ట్రక్కులను బయో సీఎన్‌జీ కింద మార్చామని.. భవిష్యత్‌లో మరిన్నింటిని అలాగే మారుస్తామని చెప్పారు. తద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు. నదుల్లో చేరుతున్న చాలా నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని.. దాన్ని ఒడిసిపట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా మంచి పని చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే ఇంద్రావతి,అటు గోదావరి నదుల నీటిని ఒడిసిపడుతోందన్నారు. గతంలో ఈ నీళ్లన్నీ వృథాగా సముద్రంలో కలిసిపోయేవని.. తెలంగాణ ప్రభుత్వం ఆ నీటిని ఉపయోగించుకుంటోందని చెప్పారు. కోస్తా తీరం వెంబడి నివసించే ప్రజలు సముద్రంలోకి వ్యర్థాలను వదలడం వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు.కాబట్టి నదులు,సముద్రాల్లో వ్యర్థాలను వదలవద్దని చెప్పారు. ముఖ్యంగా ముంబై మహానగరంలో పారిశ్రామిక వ్యర్థాలన్నీ సముద్రంలోకే వెళ్తున్నాయని.. ఆ రసాయన జలాలను శుద్ది చేశాకే సముద్రంలోకి వదలాలని అన్నారు.

Published by: Srinivas Mittapalli
First published: August 27, 2019, 4:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading